Sabarimala: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
విశేష పూజ సందర్భంగా ఈరోజు కేరళ అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవంబరు 15 నుంచి రెండు నెలల పాటూ పూర్తిస్థాయిలో తెరుచుకోనుంది. భక్తులు పాటించాల్సిన నిబంధనలేంటంటే...
కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయం ఈ నెల 15న తెరుచుకోనుంది. రెండు నెలల పాటు స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు ( బుధవారం) చితిర అత్తవిశేష పూజ సందర్భంగా ఆలయ అర్చకులు, కేరళ దేవస్వొం బోర్డు అధికారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అయ్యప్ప ఆలయం తెరిచారు. రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా స్వామివారి దర్శనాన్ని కల్పించి ఆ తర్వాత హరివరాసనం పాటతో రాత్రి 9 గంటలకు తిరిగి మూసివేయనున్నారు. ఈ నెల 15 నుంచి రెండు నెలల పాటూ స్వామి దర్శనం కలగనుంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు.
Also Read: శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
అయ్యప్ప భక్తులు పాటించాల్సిన నిబంధనలు
వర్చువల్ క్యూ బుకింగ్ వ్యవస్థ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న భక్తులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలను చూపించక పోయినా, సింగిల్ డోస్ వేసుకున్నా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ అందజేయాలి. ఈ నిబంధనలను పాటించని వారిని స్వామివారి దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు.
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
అత్యవసర చికిత్స కేంద్రాలు..
శబరిమలకు వెళ్లే మార్గంలో నీలక్కళ్ వద్ద అధికారులు ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐదు అత్యవసర వైద్య చికిత్స కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనితోపాటు పంప నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలోనూ అత్యవసర వైద్య చికిత్స, ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రథమ చికిత్సను అందించడం, బ్లడ్ ప్రెషర్‌ను చెక్ చేయడం, గుండెపోటుకు గురయ్యే వారి కోసం ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నరల్ డీఫైబ్రిలేటర్ సౌకర్యాలు కల్పించారు.
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
రవాణా సౌకర్యం..
భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 470 బస్సులను ఏర్పాటు చేసింది. వేర్వేరు నగరాలు, పట్టణాల నుంచి నేరుగా పంప వరకు ఈ బస్సులు నడుస్తాయి. నీలక్కళ్ నుంచి పంపా బేస్ క్యాంప్ వరకు షటిల్ సర్వీసుల కోసం 140 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సారి మండలం-మకరవిళక్కు సమయంలో కనీసం 10 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
Also Read: ఆ దీపాల వెలుగుల వెనుక ఇంత అర్థం ఉందా, దీపం పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి...
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read:కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి