By: ABP Desam | Updated at : 28 Oct 2021 01:42 PM (IST)
Edited By: RamaLakshmibai
Diwali 2021
పురాణ కథనం:
ద్వాపర యుగంలో దీపావళి ప్రస్తావనపై ఓ కథనం ఉంది. భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీమహావిష్ణువుకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని చెబుతారు. ఇక ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదురోజుల పాటూ సెలబ్రేట్ చేసుకుంటారు.
Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
1.ధన త్రయోదశి
ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. ఇక క్షీరసాగర మథనంలో ఇదే రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని అందుకే ఈ రోజున అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు.
Also Read: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!
2.నరక చతుర్దశి
దీపావళి ముందు రోజు నరక చతుర్దశి. ఈ రోజు నువ్వుల నూనె పట్టించుకుని తలంటు పోసుకుంటే దోషాలు పోతాయని చెబుతారు. నరకాసుర వధ జరిగిన ఈ రోజునుంచే క్రాకర్స్ కాల్చడం మొదలుపెడతారు.
3. దీపావళి అమావాస్య
ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండగ. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డలతో ఒత్తిలు చేసి కాగడాలుగా వెలిగిస్తారు. అవి పూర్తిగా ఆగిన తర్వాత కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లి స్వీట్స్ తిన్నా ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. నువ్వుల నూనె, ఆవు నేతితో దీపాలు వెలిగించాలని పండితులు చెబుతారు. ఈ సమయంలోనే లక్ష్మీదేవిని పూజిస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తారు.
4.బలి పాడ్యమి
దీపావళి మర్నాడు కార్తీకమాసం మొదలవుతుంది. ఈ మొదటి రోజునే బలిపాడ్యమి అని అంటారు. చతుర్దశి రోజు విష్ణుమూర్తి పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమ్మీదకి వచ్చిన రోజు అని చెబుతారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. మరోవైపు శ్రీకృష్ణుడు గోవర్థనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడినదీ ఇదే రోజు.
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
5. భగిని హస్త భోజనం
భగినీ హస్తం భోజనం అంటే మరో రాఖీపండుగ అన్నమాట. దీన్నే యమద్వితీయ అనికూడా అంటారు. ఈ రోజున స్త్రీలు తన సోదరుడి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని చెబుతారు. దీనివెనకున్న కథ ఏంటంటే.. సూర్యభగవానుడి కుమారుడు యముడు, ఆయన సోదరి యమున. ఆమెకు సోదరుడంటే అంతో అభిమానం. ఎన్నిసార్లు ఇంటికి ఆహ్వానించినా యముడు మాత్రం క్షణం తీరికలేకుండా ఉండేవాడు. అయితే కార్తీక విదియ రోజు తప్పకుండా రావాలని చెప్పి వాగ్ధానం తీసుకుంటుంది యమున. యముడు కూడా తనను ఎవ్వరూ ఇంటికి పిలవరు పైగా స్వయాన తోబుట్టువుకి వాగ్ధానం చేసి వెళ్లకుండా ఉండడం భావ్యం కాదని భావించిన యముడు సోదరి ఇంటికెళతాడు. యముడిని చూసి సంతోషించిన యమున అభ్యంగన స్నానం చేయించి , తిలకం దిద్ది, స్వయంగా వంట చేసి ప్రేమగా వడ్డిస్తుంది. సంతోషించిన యముడు ఆమెకు ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఏటా ఇదే రోజున తన ఇంట విందుకి రావాలని కోరుతుంది. సరే అన్న యముడు సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుందంటాడు. ఆ రోజు నుంచి ఏటా కార్తీకమాసంలో రెండో రోజు విదియ రోజు సోదరులు సోదరిల ఇంటికెళ్లి భోజనం చేయడం విధిగా వస్తోంది. రాఖీ రోజు అన్నదమ్ముడు సోదరికి కానుకలిస్తే... భగనీహస్త భోజనం రోజు సోదరి.. సోదరుడికి భోజనం పెట్టి కొత్త వస్త్రాలు అందిస్తుంది.
ఇలా మొత్తం ధన త్రయోదశి నుంచి భగనీహస్త భోజనం వరకూ దీపావళిని ఐదురోజులు జరుపుకుంటారు.
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
Also Read: ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Daily Horoscope Today Dec 6, 2023 : ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది, డిసెంబరు 6 రాశిఫలాలు
Astrology: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!
Christmas Tree: క్రిస్మస్ రోజు ఆ ట్రీ ఎందుకు పెడతారు? ఆ సాంప్రదాయం ఎలా మొదలైంది?
Bhishma Niti: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!
Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>