Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై 9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ ఎటాక్ దిగింది. రష్యాలోని పెద్ద నగరాల్లో ఒకటి అయిన కజాన్ లోని భారీ భవనాలపై చేసిన దాడుల దృశ్యాలు వైరల్ గా మారాయి.
9/11 Style Drone Attack On Russian Buildings In Kazan: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి దాడి చేసిన వైనాన్ని చూస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. అప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఇలాంటి దాడులు తమపై జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే డ్రోన్లు వచ్చిన తర్వాత ఆ జాగ్రత్తలన్నీ పెద్దగా ఉపయోగపడటం లేదు. తాజాగా ఉక్రెయిన్ ఇలాంటి అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ తో రష్యాపై విరుచుకుపడింది.
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించి ఏళ్లు గడిచిపోతున్నాయి. కానీ రష్యాకు అలుపు వస్తుంది కానీ ఇంకా యుద్ధం కొనసాగితే తమకు పోయేదేమీ లేదని ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతోంది. నాటో దేశాలు కొన్ని ఆయుధాలు ఇస్తూండటంతో వారు ఏ మాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త లక్ష్యాలను టార్గెట్ చేసుకుని ముందుకెళ్తున్నారు. తాజాగా రష్యాలోని అతి పెద్ద సిటీల్లో ఒకటి అయిన కజాన్ పై .. అల్ ఖైదా తరహా ప్లాన్ తో దాడులు చేశారు.
ఎనిమిది డ్రోన్ల వంటి మనుషులు ఉండని ఎనిమిది యుద్ధవిమానాలతో కజాన్ సిటీపై దాడిచేశారు. ఖజాన్ లో చాలా పెద్ద భవనాలు ఉంటాయి. ఇలాంటి భవనాలను టార్గెట్ చేసి దాడులు చేశారు.
My hands are shaking.. I saw it with my own eyes. The building next to our apartment block was hit by drones.
— Natalia (@NataliaPRussia) December 21, 2024
While I was writing this, another explosion in different place in Kazan.
Horrible! pic.twitter.com/iDmGcKte4p
కజాన్ సిటీ రష్యాలో ఐదో అత్యంత పెద్ద నగరం, వాణిజ్య నగరంగా పేరు ఉంది. ఈ నగరంలోని బిజీగా ఉండే భవంతులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో ఎంత తమంది గాయపడ్డారు.. ఎవరైనా చనిపోయారా అన్నదానిపై రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులను మాత్రం నిర్దారించింది. ఉక్రెయిన్ మాత్రం ఇంకా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆ దాడులను చేసింది .. ఉక్రెయిన్ అని నిర్ధారణకు వచ్చారు.
UAVs have hit at least three high-rise buildings in Kazan, Russia
— NEXTA (@nexta_tv) December 21, 2024
Photos and videos from the scene are being shared on local Telegram channels. pic.twitter.com/MN19u47uom
ఈ దాడులను రష్యా సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏం చేస్తారన్నదానిపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.. ఆ అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ సరఫరా చేసింది నాటో దేశాలే అయితే పుతిన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఇప్పటికే తమపై దాడులు చేసే వారికి ఆయుధాలు ఇచ్చే దేశాలను కూడా శత్రువులుగా పరిగణిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది.
ఈ దాడులు జరగడానికి ముందు రష్యా కూడా ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఉక్రెయిన్ లోని ఆరు దేశాల రాయబార కార్యాలయలపై దాడులు చేసింది. దానికి కౌంటర్ గానే ఉక్రెయిన్ ఈ UAVలతో దాడులు చేసినట్లుగా భావిస్తున్నారు.