By: ABP Desam | Updated at : 29 Oct 2021 06:57 AM (IST)
Edited By: RamaLakshmibai
Spirituality
పాటించాల్సిన అచారాలు వదిలివేయకూడదు, అనవసరమైనవి పాటించకూడదంటారు 'ఆచార హీనం నపునంతి వేదాః' అంటే ఆచార హీనుడిని వేదాలు కూడా పవిత్రుడిని చేయలేవని అర్ధం. మడి అంటే చాదస్తం కాదు శారీరక శౌచం( శుభ్రత). పూజ లేదా వంట చేసేటప్పుడు మడి కట్టుకుంటారు. అంటే మనసు దైవం పట్ల తప్ప అన్య విషయాల వైపు పోనివ్వకూడదని అర్థం. వంట విషయంలోనూ అంతే. వంట చేసేవారు ఎంత శ్రద్ధగా, ప్రశాంతంగా చేస్తారో ఆ ఆహారం తిన్నవారిలో అంత పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది. వంట చేసే సమయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తామో, ఏ దృశ్యాలు చూస్తామో ఆ ప్రభావం తినేవారిపై ఉంటుందని చెబుతారు. అందుకే ఆహారం సిద్ధంచేసే సమయంలో మడికట్టుకోవడం ( మనస్సు మొత్తం వంటపైనే లగ్నం చేయడం) అనే పదాన్ని వాడతారు. వంట చేసేవారు చికాకు, బాధ, కుంగుబాటు, కోపానికి లోనైతే ఆ భోజనం చేసేవారి మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది. ఆ ఆహారం విషంగా మారుతుంది. మడిలో ప్రధాన అంశం కూడా ఇదే. దేన్నీ ముట్టుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, భగవంతుని ధ్యానిస్తూ వంట చేయాలి.
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
నిత్యం వంట చేసిన తర్వాత నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్పడం వెనుక కారణం కూడా ఇదే. రోజూ చేసే వంటకి, దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు చేసే వంటకి తేడా ఉంటుంది. నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు శుచిగా స్నానం చేసి, భక్తి-శ్రద్ధతో వంట చేసి నివేదిస్తాం. ఆ రోజు ఆ ఇంట భోజనం చేసిన వారంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడే మరో క్లారిటీ ఏంటంటే ఏదైనా పండుగ రోజు ఇంట్లో వాతావరణం, ఆ రోజు తిన్న భోజనానికి...మిగిలిన రోజుల్లో వాతావరణం-ఆ రోజుల్లో భోజనానికి వ్యత్యాసం గమనిస్తే మీకే అర్థమవుతుంది. దేవుడికి నివేదించిన ఆహారంలో దైవత్వం, దివ్యత్వం నిండి ఉంటుంది. అది తిన్నవారి మనస్సులోకి దివ్యత్వం ప్రవేశిస్తుంది...అలాంటి వారి ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయంటారు పెద్దలు. అందుకే ఉతికి ఆరవేసిన శుభ్రమైన వస్త్రాలు ధరించి , ముఖాన బొట్టు పెట్టుకుని, జుట్టు ముడివేసుకుని వంట చేయాలని చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మడి అంటే మానసిక ప్రశాంతంత, దైవత్వం నిండిన ఆలోచన, ధ్యాసను మొత్తం ఒక దగ్గరే కేంద్రీకరించడం అంటారు పెద్దలు.
ఇవన్నీ పురాణాల్లో ప్రస్తావించినవి, పండితులు చెప్పిన నియమాలు మాత్రమే. ఇవి ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవడం అన్నది వారి వారి విశ్వాసాలు, అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!
Bhagavad Gita Sloka: గీతాసారమంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది
Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శని అనుగ్రహం ఖాయం
Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Evil eye signs: మీపై, మీ కుటుంబంపై నరదిష్టికి సంకేతాలు ఇవే
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు