By: ABP Desam | Updated at : 27 Oct 2021 06:40 AM (IST)
Edited By: RamaLakshmibai
Spirituality
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”
దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం- దీపం- నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు.
Also Read: ఏడువారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి ... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!
దీపారాధన సమయంలో చేయాల్సినవి-చేయకూడనివి
-మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదని చెబుతారు
-కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు. ఏకహారతితో కానీ, అగరుబత్తితో కానీ దీపం వెలిగించాలి
-ఒకవత్తితో దీపం పెట్టకూడదు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇక మూడు వత్తులు (త్రివర్తి) ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం.
-దేవుడికి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.
-తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు
-పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.
-ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం సిద్ధిస్తాయి.
-దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
దీపారాధనకు ఏ నూనె వాడాలి:
దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయంపై చాలామంది అయోమయానికి గురవుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభం అని పండితులు చెబుతారు.
Also Read: పూజకు పనికిరాని పూలు ఏవి...ఎందుకు?
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Panchang 28June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, కార్యసిద్ధినిచ్చే ఆంజనేయ భుజంగ స్తోత్రం
Horoscope 28th June 2022: ఈ రోజు ఈ రాశివారికి సంపన్నమైన రోజు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bonalu 2022: అమ్మవారికి ఆషాడమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి!
Panchang 27June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, పవర్ ఫుల్ శివ మంత్రం
Weekly Rasi Phalalu 27th june to 3rd july : ఈ రాశులకు చెందిన ప్రేమికుల బంధం బలపడుతుంది, జూన్ 27 నుంచి జులై 3 వరకూ వార ఫలాలు
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ