(Source: ECI/ABP News/ABP Majha)
Shani Dosham: శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని... ఏ శని దోషం నుంచి అయినా కాస్త ఉపశమనం లభించాలంటే దీపావళి రోజు ఏం చేయాలంటే...
చేసిన పూజలు, పునస్కారాలు శనిని తరిమేయవు కానీ ఉపశమనం కల్పిస్తాయి. పైగా ఒక్కో రకమైన శని ఒక్కో ప్రభావం చూపుతుంది. వీటినుంచి ఉపశమనం కోసం దీపావళి రోజు ఇలా చేయండి.
ఏలినాటి శని
ఏల్నాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం, చికాకులు, ధన నష్టం, విరోధులు పెరగడం, తొందరపాటు మాటలు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో పనిభారం ఉంటాయి.
అర్ధాష్టమ శని
అర్ధాష్టమ శనిదోషం వల్ల ప్రమాదాలు జరగడం, జ్ఞాపకశక్తి తగ్గడం, పెద్దల గురించి ఆందోళన, ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు ఉంటాయి.
అష్టమ శని
రాశి నుంచి 8వ స్థానంలో శని సంచారనాన్ని అష్టమ శని అంటారు. అష్టమ శని వల్ల ఆయుఃప్రమాణం తగ్గడం, ఆనారోగ్య సమస్యలు ,చికాకులు ఆందోళ ఉంటాయి.
ఎవ్వరికీ తప్పని శనిప్రభావం
1. హిరణ్యకశిపుడు మహా బలశాలి. అంత బలమైన రాక్షసుడు శనిదోషం వల్ల బలవత్తరమైన మరణం పొందాడు.
2. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిందీ శనిదోష ఫలితమే. ఈ దోష నివారణ అనంతరం వానరులతో స్నేహం, రావణుడిపై విజయం సాధించాడు.
౩. నలమహారాజు శనిదోషం వల్ల నల్లటి రూపం పొంది ఏడేళ్లు వంటవానిగా జీవితం సాగించాడు.
4. ద్వాపర యుగంలో పాండవులు ఈ శనిదోషం వల్ల 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి అడవుల వెంట తిరిగి నానా ఇబ్బందులు పడ్డారు.
5. ఈశ్వరుడు కూడా శనికి భయపడి చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడు.
అందుకే శనికి ఎవ్వరూ అతీతులు కాదు. కానీ కొన్ని దోష నివారణలు చేయడం ద్వారా రాబోయే ముప్పు నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
శనిదోష నివారణకు దీపావళి రోజు ఏం చేయాలంటే:
దీపావళి రోజు ఉదయాన్నే తలకిస్నానం చేసి మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి గుడ్డలో మూట కట్టాలి. ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి. దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొడతారు. దివ్వ కొట్టి (ఈ పద్దతి కొన్ని ప్రాంతాల వారికి ఉంది కొన్ని ప్రాంతాల వారికి లేదు) ఇంట్లోకి వచ్చాక బయట దీపాలు పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తాం. మొత్తం అంతా పూర్తైంది ఇక ఇంట్లోకి వెళ్లిపోవడమే అనే సమయంలో ఈ నువ్వుల దీపాన్ని వెలిగించాలి.
Also Read: ధన త్రయోదశికి బంగారానికి లింకేంటి, ఈ రోజు లక్ష్మీ పూజ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి?
నువ్వుల దీపం:
బాణసంచా కాల్చడం పూర్తయ్యాక ఇక పండుగ హడావుడి పూర్తైంది లోపలకు వెళ్లిపోవడమే అనే సమయంలో... ఉదయం నుంచి నానబెట్టి ఉంచిన నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట, నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి. మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు. కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శనిదీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనని తరిమికొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నామని అర్థం వచ్చేలా. అయితే శనిదీపం ఎప్పుడు పెట్టినా మంచిదా... దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం ఉత్తమం.
వైద్యం కన్నా నమ్మకం ప్రధానం అన్నట్టు ఇదికూడా అంతే. ఇలాచేస్తే శనిప్రభావం తగ్గుతుందనే భావన కూడా సగం బలాన్నిస్తుందంటారు పెద్దలు. ఇక ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు ఫాలో అవొచ్చు.
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి