AR Rahman: ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టారు... రెండు కోట్లు డిపాజిట్ చేయండి... ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
Ponniyin Selvan 2 Controversy: ఆస్కార్ పురస్కార గ్రహీత, ఇండియాలోని దిగ్గజ సంగీత దర్శకులలో ఒకరైన ఏఆర్ రెహమాన్ మీద కాపీరైట్ కేసు నమోదు అయింది.

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) మీద కాపీ రైట్ కేసు నమోదు అయింది. ఢిల్లీ హై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసులో రెండు కోట్ల రూపాయలను కోర్టులో డిపాజిట్ చేయవలసిందిగా న్యాయమూర్తి ఏఆర్ రెహమాన్, లైకా ప్రొడక్షన్స్ - మద్రాస్ టాకీస్ సంస్థలను ఆదేశించారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టారు
మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్ 2'కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని 'వీరా రాజా వీర' పాట జూనియర్ డాగర్ బ్రదర్స్ స్వరపరిచిన శివ స్తుతికి కాపీ అంటూ ఆయన వారసులు కోర్టును ఆశ్రయించారు.
పరమ శివునికి అంకితం జూనియర్ డాగర్ బ్రదర్స్ ఒక పాటను చాలా సంవత్సరాల క్రితం రూపొందించారు. ఆ బాణీని కాపీ చేయడంతో పాటు సాహిత్యంలో కొద్దిపాటి మార్పులు చేసి వాడుకున్నారని ఆరోపిస్తూ ఫసియుద్దీన్ డాగర్ కుమారుడు ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డాగర్ కోర్టులో వాదించారు. ఆ రెండు రెండు బాణీలు విన్న న్యాయమూర్తి... రెహమాన్ కాపీ చేసినట్లు అనిపించిందని, ఈ కేసు కాపీరైట్ వయలేషన్ కేసు కిందకు వస్తుందని తెలిపారు.
తుది తీర్పు వచ్చేవరకు...
రెండు కోట్ల డిపాజిట్ చేయండి!
రెహమాన్ కాపీ చేసినట్లు అనిపించిందని మాత్రమే ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కాపీ చేశారని తీర్పు ఇవ్వలేదు. అయితే తుది తీర్పు వచ్చే వరకు రెండు కోట్ల రూపాయలను కోర్టులో డిపాజిట్ చేయవలసిందిగా రెహమాన్ సహా లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ సంస్థలను ఆదేశించింది. సినిమా స్ట్రీమింగ్ అవుతున్న అన్ని ఓటీటీ వేదికలలో జూనియర్ డాగర్ సోదరులకు క్రెడిట్ ఇవ్వవలసిందిగా పేర్కొంది. అంతే కాకుండా కోర్టు ఖర్చుల కింద దగ్గర కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలను చెల్లించమని పేర్కొంది.
Also Read: పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్... 'ఉస్తాద్ భగత్ సింగ్'కు పాన్ ఇండియా హీరోలు షాక్ అయ్యే రేంజ్‌లో?
మరో వైపు రెహమాన్ న్యాయవాది సంప్రదాయ ద్రుపద బాణీలో శివ స్తుతి ఉందని, ఆ కంపొజిషన్ ఎవరి సొంతమూ కాదని, ఒరిజినల్ కూడా కాదని, ఇది కాపీ రైట్ కేసు కిందకు రాదని వాదించారు.
Also Read: 'బేబీ' నిర్మాతలతో కలిసి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా... క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారండోయ్





















