తమిళనాట అత్యంత పాఠకాదరణ పొందిన నవల 'పొన్నియిన్ సెల్వన్'. చోళ రాజుల చరిత్ర నేపథ్యంలో ఉంటుంది. 

'పొన్నియిన్ సెల్వన్'ను అదే పేరుతో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు మణిరత్నం. ఈ సినిమా ఎలా ఉంది?

కథేంటి? : చోళ రాజు సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) కు ముగ్గురు సంతానం ఆదిత్య కరికాలుడు (విక్రమ్), అరుళ్ మొళి (జయం రవి), కుందైవి (త్రిష). 

సుందర చోళుడు కుమారులిద్దరూ యుద్ధ వీరులు. కుమార్తె రాజతంత్రం తెలిసిన వ్యక్తి. వీళ్లకు వ్యతిరేకంగా సామంతులు కుట్ర పన్నుతారు. 

ఆదిత్య కారికలుడిని కాదని, సుందర చోళుడు అన్న కుమారుడు మధురాంతకుడు (రెహమాన్)ను యువరాజు చేయాలనుకుంటారు. ఆ కుట్రలను సుందర చోళుడి సంతానం ఎలా అడ్డుకుంటుంది? అనేది కథ. 

ఎలా ఉంది? : 'పొన్నియిన్ సెల్వన్'లో బలమైన సన్నివేశాలు, పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఉన్నప్పటికీ... దర్శకుడు మణిరత్నం తెరపైకి తీసుకు రాలేకపోయారు. 

'పొన్నియిన్ సెల్వన్'లో హై ఇచ్చే మూమెంట్స్ చాలా తక్కువ. మణిరత్నం శైలిలో కథనం నెమ్మదిగా సాగుతుంది. వార్ సీక్వెన్సులు అంత ఎఫెక్టివ్ గా లేవు. 

ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. సెకండాఫ్‌లో కొంచెం స్పీడ్ ఉంది. అదీ పతాక సన్నివేశాలు వచ్చినప్పుడు వేగం పుంజుకుంది. 

రెహమాన్ పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. కథను కొంత ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బావుంది. కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ బాలేదు.

తమిళ పేర్లు, క్యారెక్టర్ల మధ్యలో ఉన్న సంబంధాలు అర్థం చేసుకోవడానికి కొంచెం టైమ్ పడుతుంది. 

మణిరత్నం డీటైలింగ్ పేరుతో కొన్ని సన్నివేశాలు బాగా తీసినప్పటికీ... సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఇవ్వడం ఫెయిల్ అయ్యారు.

ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. అయితే... త్రిష, ఐశ్వర్యకు ఎక్కువ మార్కులు పడతాయి. త్రిష కెరీర్ బెస్ట్ లుక్ కుందైవి అని చెప్పాలి. 

వందియతేవన్ పాత్రలో కార్తీ వినోదం పండించారు. ఫైట్స్ కూడా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. 

'బాహుబలి' చూసిన కళ్ళకు 'పొన్నియిన్ సెల్వన్' నచ్చడం కష్టమే. ఈ సినిమా చూడాలంటే, థియేటర్లలో చివరి వరకూ ఉండాలంటే చాలా ఓపిక కావాలి.