వావ్, గురి తప్పని రాఖీ భాయ్ - యష్ షూటింగ్ స్కిల్స్ చూశారా?

కన్నడ నటుడు యష్ గురించి మీకు తెలిసింది.

‘కేజీఎఫ్’ మూవీ సీరిస్‌లతో రాఖీ భాయ్‌గా క్రేజ్ సంపాదించాడు.

‘కేజీఎఫ్’ తర్వాత యష్ తన కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు.

అయితే, దీపావళికి ఫ్యాన్స్‌కు పటాస్‌లాంటి కబురు చెప్పనున్నట్లు సమాచారం.

ఇప్పటికే యష్ ఆ మూవీ కోసం అన్ని విధాలా రెడీగా అవుతున్నట్లు తెలిసింది.

తాజా యష్ పోస్ట్ చేసిన వీడియో చూసి అంతా అదే అనుకుంటున్నారు.

ఈ వీడియోలో మీరు రాఖీ భాయ్ షూటింగ్ స్కిల్స్ చూడొచ్చు.

గురి తప్పకుండా టార్గెట్లను షూట్ చేస్తూ యష్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇదంతా తర్వాతి సినిమా గురించే కదా, మాకు తెలుసు అని ఫ్యాన్స్ అంటున్నారు.

రాఖీ భాయ్ షూటింగ్ స్కిల్స్ చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

Images and Videos Credit: Yash/Instagram