విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, 'జయం' రవి ప్రధాన తారలుగా మణిరత్నం తెరకెక్కించిన సినిమా 'పొన్నియన్ సెల్వన్' మణిరత్నానికి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు తోడు భారీ తారాగణం ఉన్నా తెలుగులో సినిమాకు భారీ హైప్ రాలేదు. 'పొన్నియన్ సెల్వన్'కు తెలుగులో బిజినెస్ ఎలా ఉంది? ఎన్ని కోట్లకు అమ్మారు? ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? అంటే... 'పొన్నియన్ సెల్వన్ 1' నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు 3.5 కోట్లకు విక్రయించారట. సీడెడ్ ఏరియా బిజినెస్ రూ. 2 కోట్ల రేషియోలో జరిగిందని టాక్. ఆంధ్రాలో 'పొన్నియన్ సెల్వన్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.5 కోట్లు జరిగిందట. తెలుగులో 'పొన్నియన్ సెల్వన్'ను రూ. 10 కోట్లకు అమ్మారని, రూ. 10.50 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెంట్ అవుతుందట. తెలుగులో 'పొన్నియన్ సెల్వన్'ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.