కథేంటి?: ప్రభు (ధనుష్) అమ్మాయిని దెయ్యం ఆవహిస్తుంది. కథిర్ (ధనుష్)ను చంపితే అమ్మాయి నుంచి వెళ్లిపోతానంటుంది.

కథిర్, ప్రభు ట్విన్స్. కవలలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు? కన్న కుమార్తె కోసం అన్నయ్యను ప్రభు చంపాడా? లేదా? అనేది సినిమా. 

ధనుష్ బాగా చేశాడు. కథిర్ పాత్రలో ఆయన నటన బావుంది. కానీ, ఆ నటనను ఎలివేట్ చేసే సీన్స్ లేవు.

కథలో మంచి పాయింట్ ఉంది. అయితే, ట్విన్స్ మధ్య సంఘర్షణను సరిగా తెరపైకి తీసుకు రాలేదు. 

ముఖ్యంగా కథిర్ పాత్రకు ప్రారంభంలో ఇచ్చిన ఎలివేషన్, ఆ తర్వాత కంటిన్యూ చేయలేదు. 

'నేనే వస్తున్నా' ఫస్టాఫ్‌లో మెలో డ్రామా ఎక్కువ. సెకండాఫ్ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయినప్పటికీ... ఎండింగ్ బాలేదు. 

దర్శకుడిగా సెల్వ రాఘవన్ కొన్ని చోట్ల మెరుపులు మెరిపించారు. ఓవరాల్‌గా చూస్తే డిజప్పాయింట్ చేశారు. 

యువన్ శంకర్ రాజా సంగీతం, కథిర్ పాత్రకు ఇచ్చిన నేపథ్య సంగీతం బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా!

ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఇందులో థ్రిల్స్ తక్కువ, బోరింగ్ మూమెంట్స్ ఎక్కువ. ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్.