‘బిగ్ బాస్’ లహరికి దెయ్యం పట్టిందా? మెడ ఫసక్! లహరి షారి, ‘బిగ్ బాస్’ సీజన్-5లో కనిపించే వరకు ఈమె ఎవరో తెలీదు. ఆమె ఎవరో తెలిసిన తర్వాత.. ఓహో ఈమెనా, కనిపెట్టలేకపోయామే అనుకున్నారంతా. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో లహరి డాక్టర్‌గా నటించింది. ఆ తర్వాత మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి సినిమాల్లో కనిపించింది. ‘బిగ్ బాస్’ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే, గుర్తుండిపోయే పాత్రలేవీ లహరీకి లభించకపోవడం బ్యాడ్ లక్. అందం, అభినయం అన్నీ ఉన్నా.. ఎందుకో తగిన అవకాశాలు లభించడం లేదు. లహరి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఫొటోలు, వీడియోలతో అలరిస్తుంటుంది. తాజాగా లహరి దెయ్యం పట్టినట్లుగా నటిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. దెయ్యలా ఊగిపోతూ.. తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని మెడకు గుచ్చుకుంది. ఆ త్రిశూలం రబ్బరుది కావడం వల్ల ఆమెకు ఏమీ కాలేదు. Images and Video Credit: Lahari Shari/Instagram