మనసున్న మహారాణులు, సామాజిక సేవల్లో మన హీరోయిన్లు సమంత - ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు సాయం చేస్తోంది. కాజల్ - ప్రత్యేకంగా సంస్థ లేదు. ఓ అమ్మాయి చదువుకు రూ.లక్ష సాయం చేసింది. ప్రణీత - కర్ణాటకలో స్కూళ్లను దత్తత తీసుకుంది. వాటిని నవీకరిస్తోంది. సదా - సమయం దొరికినప్పుడు సామాజిక సేవల్లో బిజీగా ఉంటుంది. ఈమె జంతు ప్రేమికురాలు. పూజా హెగ్డే ‘ఆల్ అబౌట్ లవ్’ అనే సేవా సంస్థ ద్వారా పిల్లలకు వైద్య, ఆర్థిక సాయం చేస్తోంది. రకుల్ ప్రీత్ - కరోనా వేళ మురికివాడ ప్రజలకు సాయం చేసింది. కీర్తి సురేష్ - లేదు అనకుండా సాయం చేస్తుంది. గతంలో కేరళ ఫ్లడ్ రిలీఫ్‌లో చురుగ్గా పాల్గొంది. అనుష్క శెట్టి - ఎవరు సాయం అడిగినా కాదనకుండా సాయం చేస్తుంది. కృతిశెట్టి - కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోడానికి ‘నిష్న- ఫీడ్ ది నీడ్’ అనే సంస్థ ప్రారంభించింది. బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్, దీపిక పదుకొనే, అనుష్క శర్మ, కత్రినా కూడా సామాజిక సేవలు చేస్తున్నారు. Images Credit: Instagram and Other Social Media