సూర్య to అంబారిష్ - ‘బాహుబలి’ బాటలో మరిన్ని పిరియాడిక్ చిత్రాలు! ‘బాహుబలి’ సీరిస్.. ఇప్పుడు ఎన్నో సినిమాలకు స్ఫూర్తినిస్తోంది. రాజమౌళి సాహసం.. ఇప్పుడు ఎంతోమందిలో ధైర్యం నింపుతోంది. ఆయన బాటలో హిస్టరీకల్ మూవీస్ చేయడానికి అంతా ముందుకొస్తున్నారు. ఇటీవల ‘బింబిసార’ ఎంత మంచి హిట్ కొట్టిందో తెలిసిందే. త్వరలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం కూడా థియేటర్లో సందడి చేయనుంది. ‘పొన్నియిన్ సెల్వన్’ ట్రైలర్‌కు ఇప్పటికే మాంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో సూర్య కూడా మరో ప్రయోగం చేస్తున్నారు. ‘సూర్య 42’ చిత్రంలో ధీరుడి గెటప్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కన్నడంలో అంబారిష్, సుమలత కుమారుడు అభిషేక్ కూడా వీరుడి అవతారం ఎత్తాడు. AA04లో వారియర్ గెటప్‌లో ప్రత్యక్షమయ్యాడు. అదిరిపోయే ఫస్ట్ లుక్ వదిలాడు. ఇక తెలుగులో ‘హరిహర వీరమల్లు’ మూవీ కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.