మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన ప్రాంగణంలో మెగాస్టార్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. మెగాస్టార్ కటౌట్, దానిపై డ్రోన్స్ సహాయంతో కురిపించిన పూల వర్షం మెగా ఫాన్స్, ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. 'గాడ్ ఫాదర్' సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆయన కటౌట్ కూడా పెట్టారు. 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన గ్రౌండ్ లో స్టేజికి ఒకవైపు చిరు, మరోవైపు సల్మాన్ ఖాన్ కటౌట్స్ ఉన్నాయి. సల్మాన్ కటౌట్ మీద పూల వర్షం. ప్రీ రిలీజ్ వేడుకకు ముందు రోజు సినిమాలో 'నజభజ జజర' పాట విడుదల చేశారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. (All Images & Videos courtesy - @Godfather movie unit)