గాల్లో సుమ, పడిపోతారు సుమా! ఫన్ క్రియేట్ చేయడంలో యాంకర్ సుమ తర్వాతే ఎవరైనా. అందుకే ఆమె షో వస్తుందంటే అంతా టీవీలకు అతుక్కుపోతారు. ముఖ్యంగా ఆమె పంచ్‌లు కడుపుబ్బా నవ్విస్తాయ్. ఇటీవల సుమ అనసూయతో కలిసి ఫన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం సుమ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఆమె బాలి వెళ్లినట్లు సమాచారం. తాజాగా సుమ రెండు కొబ్బరి చెట్ల మధ్య ఉయ్యాల ఊగారు. ఆ వీడియోను సుమ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తే మీకు కూడా కళ్లు తిరుగుతాయి. Images and Videos Credit: Suma/Instagram