అందుకు సమయం పడుతుంట, శ్రీహన్ విన్నవా.. సిరి కామెంట్స్! యూట్యూబర్ సిరి.. ‘బిగ్ బాస్’కు వెళ్లిన తర్వాత బాగా పాపులర్ అయ్యింది. ‘బిగ్ బాస్’ టైటిల్ గెలుచుకోలేకపోయినా అపవాదు మూటగట్టుకుంది. ‘బిగ్ బాస్’లో ఆమె షన్ముఖ్ జస్వంత్‌తో క్లోజ్‌గా ఉండటమే ఇందుకు కారణం. సిరి బిగ్ బాస్‌కు వెళ్లినప్పటికే శ్రీహన్‌తో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. అదే జరిగి ఉండకపోతే ప్రేక్షకులు కూడా ఆమెను తప్పుపట్టేవారే కాదు. సిరితో క్లోజ్‌గా ఉండటం వల్ల షన్ను ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. అయితే, శ్రీహన్ మాత్రం సిరి మళ్లీ జీవితంలోకి ఆహ్వానించాడు. ప్రస్తుతం శ్రీహన్ ‘బిగ్ బాస్’ సీజన్-6లో ఉన్నాడు. చూస్తుంటే, టాప్-5లోకి చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, సిరి మాత్రం ‘కొన్ని విషయాలకు టైమ్ పడుతుంది’ అని ఇన్‌స్టాలో పేర్కొంది. మరి, దానికి అర్థం ఏమిటో తెలియక నెటిజనులు బుర్ర గోక్కుంటున్నారు. శ్రీహన్ ‘బిగ్ బాస్’లో నిలదొక్కుకోడానికి టైమ్ పడుతుందని చెప్పే ప్రయత్నం కాబోలు! Images and Videos Credit: Siri Hanumanthu/Instagram