Balochistan War: పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
Pakistan Army: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పది మంది పాక్ సైనికుల్ని చంపేసింది. క్వెట్టా సమీపంలో ఈ దాడి జరిగింది.

Balochistan Liberation Army killed ten Pakistani soldiers : బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై క్వెట్టా సమీపంలోని మార్గట్ ప్రాంతంలో దాడి చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఫిదాయీ యూనిట్ రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED) ఉపయోగించి పాకిస్తానీ సైన్యం కాన్వాయ్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
The Baloch Liberation Army (BLA) has Released a Video of the Remote-Controlled BOMB Attack carried out today in the Margat area on the outskirts of Quetta. #10 personnel of the #Pakistani army were #Killed in the Attack. The targeted military vehicle was completely destroyed. pic.twitter.com/YKN3seBNRY
— Vaibhav Singh (@vaibhavUP65) April 25, 2025
BLA తమ దాడిలో 10 మంది పాకిస్తానీ సైనికులను చంపినట్లు వీడియో రిలీజ్ చేసింది. అయితే పాకిస్తానీ అధికారులు ఈ సంఖ్యను ధృవీకరించలేదు.BLA మీడియా విభాగం హక్కల్ ఈ దాడి యొక్క వీడియో ఫుటేజీని విడుదల చేసింది, ఇది దాడి యొక్క తీవ్రతను , వాహనం ధ్వంసమైన దృశ్యాలను చూపిస్తుంది. BLA ప్రతినిధి జీయంద్ బలూచ్ ఈ దాడిని ధృవీకరిస్తూ, ఇది "బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం" జరిగిన ఆపరేషన్‌లో భాగమని పేర్కొన్నాడు.
#BrakingNews 🚨बलूचिस्तान में BLA का हमला बलूच लिबरेशन आर्मी (BLA)
— Pankaj Jhajhria (@pankajhajhria) April 26, 2025
काफिले में सवार 10 पाकिस्तानी कर्मियों की मौत हो गई। एक पूरा वाहन नष्ट हो गया.
Pakistan में अभूतपूर्व स्थिति.
BLA ने वीडियो भी प्रकाशित किया है।#FreeBalochistan pic.twitter.com/5ECWO8GcPF
పాకిస్తానీ సైన్యం లేదా పోలీసుల నుండి ఈ ఘటనపై అధికారిక ధృవీకరణ ఇంకా స్పష్టంగా రాలేదు, కానీ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ ఈ దాడిని ఖండించారు. పాకిస్తానీ మీడియా, అధికారులు ఈ దాడిని "తీవ్రవాద చర్య"గా వర్ణించారు.
BLA అనేది బలూచిస్తాన్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న విమోచన సాయుధ సంస్థ. ఈ సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌ను ఆర్థికంగా దోపిడీ చేస్తోందని, స్థానిక బలూచ్ ప్రజలను విస్మరిస్తోందని ఆరోపిస్తుంది. BLA గత రెండు దశాబ్దాలుగా పాకిస్తానీ సైన్యం, ప్రభుత్వ సంస్థలు, ,చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. ఏప్రిల్ 15న మస్తుంగ్‌లో ముగ్గురు సైనికులు మరణించారు, ఏప్రిల్ 17న కెచ్ జిల్లాలో ఒక సైనికుడు మరణించాడు, ఏప్రిల్ 20న హోషాబ్‌లో లెవీస్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు BLA సైనిక సామర్థ్యం,వ్యూహాత్మక దాడుల సామర్థ్యం పెరిగినదానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.
ఈ దాడి పాకిస్తానీ సైన్యం బలూచిస్తాన్‌లో చేస్తున్న "ఆక్రమణ"కు ప్రతిస్పందనగా జరిగింది. సైనికులను లక్ష్యంగా చేసుకున్నామని, స్వాతంత్ర్య పోరాటంలో భాగమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మి ప్రకటించుకుంది. బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద , సహజ వనరులతో సమృద్ధమైన ప్రాంతం, కానీ ఇది అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ప్రత్యేక బలూచిస్తాన్ కోసం అక్కడి ప్రజలు పోరాడుతున్నారు.





















