(Source: Poll of Polls)
Vastu Shastra: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఈ 7 సరిగ్గా ఉంటే వద్దన్నా డబ్బు, ఆనందం, ఉన్నతి మీ సొంతం!
Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రానికి సంబంధించి చిన్న చిన్న చర్యలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుతాయి. అలాంటి 7 వాస్తు శాస్త్ర సూచనలు ఇక్కడున్నాయి

Effective Vastu Solutions: ఇంట్లో ఉండే సానుకూల వాతావరణం, ప్రతికూల వాతావరణం ఈ రెండూ వాస్తు శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి. వాస్తు సరిగ్గా ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులుండవు, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ఆ ఇంట్లో ఉంటాయి. వాస్తు ప్రకారం చిన్న లోపం ఉన్నా ఎదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ 7 వాస్తు చర్యలు మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాయని సూచిస్తారు వాస్తు శాస్త్ర పండితులు.
తులసి మొక్క
తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్యంలో తులసిమొక్క నాటడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నిత్యం తులసికి నీరుసమర్పించడంతో పాటూ ఉదయం,సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే ఇంట్లో మొత్తం సానుకూల శక్తి నిండిఉంటుంది
సరైన స్థలంలో పూజా మందిరం
ఇంట్లో పూజా మందిరం మీకు కుదిరిన దగ్గర కాదు..ఉండాల్సిన చోటే ఉంచాలి. ఈశాన్య దిశలో పూజా మందిరం ఇంట్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆరాధన స్థలాన్ని నిత్యం శుభ్రం చేయాలి. దీపం వెలిగించి పూజ చేయాలి. ఆరాధన సమయంలో మీరు తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చునేలా దేవుడి మందిరం ఉంచే ప్రదేశం ఉండాలి.
పరిశుభ్రత
కొన్ని ఇళ్లు ఎంత శుభ్రం చేసినా కానీ నిత్యం దుమ్ము, ధూళితో నిండి ఉంటాయి. ఇల్లంతా నిండిఉండే ధూళి ప్రతికూల శక్తికి ఆహ్వానం పలుకుంది. అనారోగ్య సమస్యలు పెంచుతుంది. ముఖ్యంగా భారీ వస్తువులు ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఈశాన్య దిశలో బరువైన వస్తువులు ఉంచకూడదు..ఈ ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో విరిగిన, పాడైన వస్తువులు ఎప్పటికప్పుడు తొలగించాలి.
శంఖం - బెల్ ధ్వని
ఇంట్లో శంఖం, గంటల ధ్వని సంతోషాన్నిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ శబ్ధం పర్యావరణాన్ని శుభ్రం చేస్తుంది. సానుకూల శక్తి ప్రసరించేలా చేస్తుంది.
సరైన దిశలో నిద్ర
వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే దిశ కూడా చాలా ముఖ్యం. తలను దక్షిణ దిశగా లేదంటే తూర్పు దిశగా ఉండాలి..అంటే మీరు నిద్రలేచేసరికి ఎదురుగా ఉత్తర దిశ కానీ, పడమర దిశ కానీ ఉండాలి. ఈ దిశగా తల పెట్టుకుంటే నిద్రలేమి ఉండదు..మానసిక వత్తిడి దూరమవుతుంది.
గోడలపై ఆహ్లాదకరమైన చిత్రాలు
ఇంటి గోడలపై ఆహ్లాదకరమైన చిత్రాలు ఉంచాలి. పచ్చదనం, జలపాతం, మీకు నచ్చిన జంతువు చిత్రాలు ఉంచితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ చిత్రాలు సానుకూల శక్తులను ఆహ్వానిస్తాయి
శ్రీయంత్రం
ఇంటి ఈశాన్యంలో శ్రీ యంత్రాన్ని పెట్టుకోండి. శ్రీ యంత్రం ఉన్నచోట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని నమ్ముతారు. మంచి సమయంలో దేవుడి మందిరంలో పెట్టి నిత్యం పూజచేస్తే ఆ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి
ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ మీ ఇంట్లో సానుకూల శక్తులను ప్రసరింపచేస్తాయి. ఆరోగ్యం,మానసిక ప్రశాంతత, ఆనందాన్ని నింపుతాయి.
గమనిక: వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్న వివరాల ఆధారంగా రాసిన కథనం. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే..దీనిని పరిగణలోకి తీసుకునే ముందు మీకు విశ్వశించే నిపుణుల సలహాలు తీసుకోండి.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి





















