Viral Video: చెత్త సమస్యతో చితక్కొట్టుకున్నారు - ఒకరి ప్రాణం పోయింది - గొడవలు పడే ఇరుగుపొరుగు వారికి గుణపాఠం -వీడియో
Physical Fight: ఇరుగు పొరుగువారితో ఈగో సమస్యలు సహజం. సర్దుకుపోకపోతే చాలా గొడవలు అయిపోతాయి. అవి హత్యలకూ కారణం కావొచ్చు.

Physical Fight With Neighbour Over Garbage Disposal: ఓ కాలనీ.. అందులో ఇరుగు పొరుగు వారు. ఇంటి ముందు ఊడుస్తున్నచెత్త మా ఇంటి ముందుకు వస్తోందని రెండు ఇళ్ల మధ్య చాలా కాలంగా గొడవ జరుగుతోంది. ఈ గొడవ రెండు రోజుల కిందట కొట్టుకునే వరకూ వెళ్లింది. ఈ గొడవలో ఒకరు చనిపోయారు. వారిలో ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో మరొకరి కుటుంబం గొడవకు దిగింది.
పోలీసు అధికారుల ప్రకారం గ్వాలియర్‌లోని థాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నితిన్ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. మృతుడిని ఈ-రిక్షా డ్రైవర్ అనిల్ మహోర్‌గా గుర్తించారు. అతను కుటుంబానికి ఏకైక జీవనాధారం. శుక్రవారం, అనిల్ తన పొరుగున ఉన్న నరేంద్ర యాదవ్ దగ్గర చెత్త విసిరిన తర్వాత అతనితో గొడవకు దిగడంతో ఘర్షణ చెలరేగింది.
యాదవ్‌కు అనిల్‌తో పాత శత్రుత్వం ఉంది. ఈ చెత్త గొడవతో కొట్టుకన్నారు. కోపంతో అనిల్ నరేంద్రను కర్రతో కొట్టాడు. ప్రతీకారంగా నరేంద్ర సోదరుడు యోగేంద్ర యాదవ్ , వారి ఇంట్లోని అనేక మంది మహిళలు అనిల్‌పై దాడి చేశారు.
అనిల్‌ను నేలపై పడవేసి, తన్నడం, గొంతు కోసి చంపడం వీడియోలో రికార్డు అయింది. చుట్టుపక్కల వారు గొడవను ఆపడానికి ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు.
#WATCH | #Gwalior: Man Dies 4 Hours After Brutal Physical Fight With Neighbour Over Garbage Disposal#MadhyaPradesh #MPNews pic.twitter.com/Sc2wjl3bQl
— Free Press Madhya Pradesh (@FreePressMP) April 26, 2025





















