Sharwa38 Movie: మరోసారి హిట్ కాంబో రిపీట్ - శర్వానంద్ జోడీగా అనుపమ పరమేశ్వరన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
Anupama Parameswaran: శర్వానంద్, సంపత్ నంది కాంబో లేటెస్ట్ మూవీలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Anupama Parameswaran Being Part Of Sharwa38 Movie: టాలీవుడ్‌లో మరోసారి క్రేజీ కాంబో రిపీట్ కానుంది. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన 'శతమానం భవతి' మూవీ జోడీ మరోసారి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనుంది. శర్వానంద్ (Sharwanand) హీరోగా సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించనున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. తాజాగా మూవీ టీం దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
అఫీషియల్ అనౌన్స్‌మెంట్
ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా చేస్తున్నారంటూ మూవీ టీం తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ సంపత్ నంది. ఈ ప్రాజెక్టులోకి 'వార్మ్ వెల్కమ్' అంటూ అనుపమకు స్వాగతం పలికారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 60ల కాలం నాటి నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని రోల్‌లో శర్వాను చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. 'Sharwa38' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు.
Warm Welcome @anupamahere to our #Sharwa38 World 🤗
— Sampath Nandi (@IamSampathNandi) April 26, 2025
The Soul of Our Soil
Looking forward✨#CharmingStar38
Charming Star @ImSharwanand @KKRadhamohan @KirankumarMann4 @SriSathyaSaiArt pic.twitter.com/Ui2tj6QuYu
Also Read: 'నెట్ ఫ్లిక్స్' నాకు సారీ చెప్పింది - బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ పోస్టర్‌పై ఊర్వశీ ఏమన్నారంటే?
హైదరాబాద్‌లో భారీ సెట్
ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో భారీ సెట్ సిద్ధం చేశారు మేకర్స్. ఎక్కువ భాగం షూటింగ్ మొత్తం అక్కడే పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధా మోహన్ మూవీని నిర్మిస్తున్నారు. శర్వా సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఒక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కన్ఫర్మ్ కాగా.. మరో హీరోయిన్ డింపుల్ హయాతి కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
శర్వానంద్ కెరీర్‌లోనే 'శతమానం భవతి' మూవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 2017లో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. శర్వా, అనుపమ జోడీ అదుర్స్ అనిపించింది. ఇప్పుడు మళ్లీ ఈ హిట్ కాంబో రిపీట్ కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
శర్వానంద్ ప్రస్తుతం 'నారీ నారీ నడుమ మురారీ' మూవీలో నటిస్తున్నారు. సినిమా పేరుకు తగ్గట్టు అందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు సంయుక్త కాగా... మరొకరు సాక్షి వైద్య. ఈ మూవీకి 'సామజవరగమన' ఫేం రామ్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. దీంతో పాటే 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. వరుస సినిమాలతో శర్వా బిజీగా ఉన్నారు.





















