అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karthika Masam Special: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
స్నానం అనేది శరీర శుభ్రత కోసం. ఆరోగ్యాన్ని కోపాడుకోవడంలో ఇదో భాగం. అయితే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలని చెబుతారు. అంత చలిలో ఎందుకుచేయాలి.
![Karthika Masam Special: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…! Karthika Masam Special: What Is The Health Secret Behind Karthika Snanam Karthika Masam Special: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/faf955f7060bfbfe8150fd70201b013b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karthika Masam
ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం.కానీ కార్తీకమాసం నెలరోజులూ ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుకా ఆరోగ్య రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కార్తీక స్నానం ఆరోగ్య రహస్యం
సూర్యుడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా అక్కడక్కడా మిణుకు మిణుకు మంటుండగానే కార్తీకమాసంలో నదీస్నానం ఆచరించాలని చెబుతారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి , కార్తీకం నెలరోజులూ సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ విశేషం ఉంది.
- సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీకస్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెలరోజులూ ఈ నియమం పెట్టారు.
- కార్తీకమాసంలో తొందరగా నిద్రలేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవపూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు..మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది.
- నదీ స్నానం చేయాలంటే నదివరకూ నడవాలి. ఇది కూడా వ్యాయామమే. ప్రవహించే నదుల్లో సహజంగా వుండే ఔషధాలే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం.
- కార్తీక స్నానం చేసి దీపాలు నదిలో వదలిన దృశ్యాలు మనసుకి చాలా సంతోషాన్నిస్తాయి.
- నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా, ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీకమాసమే అనువైనసమయం.
- జ్యోతిషశాస్త్రం ప్రకారం నీటి మీద,మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీకమాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో ఔషధలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు.
- శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను "Electro Magnetic Activity” అంటారు.
ఇక భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు, సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కార్తీక మాసంలోనూ, పుష్కారాల సమయంలోను నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనే నియమం ఉండగా..నదీ స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది. రాత్రి ధరించిన వస్త్రాలతో నదుల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేయరాదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తర్వాతే స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత వస్త్రాలను నీటిలో ఉతకడం చేయరాదు.
Also Read: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)