MEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP Desam
ప్రధాని మోదీ మూడోసారి ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం పై ప్రజల్లో అనేక అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరపనున్నాయనే అనే అంశం ఆసక్తికరంగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం బడ్జెట్ లో కేటాయింపులు జరుపుతూనే మహిళల అభివృద్ధి కోసం బడ్జెట్ లో జరపాల్సిన కేటాయింపుల పైనా పారిశ్రామిక వేత్తలు తమ సలహాలు సూచనలను అందచేశారు. ప్రత్యేకించి అంకుర పరిశ్రమల్లో మహిళల ప్రమేయాన్ని పెంపొందించేలా మార్పులు రావాలని కోరుకుంటున్నారు. కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న వార్షిక బడ్జెట్ 2025లో మహిళలకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఉంటే ఆర్ధికంగా మహిళలు అభివ్రుద్ది చెందుతారు. ప్రభుత్వాలు చెబుతున్న మహిళా సాధికారికత సాధ్యమవుతోందా. తాజా బడ్జెట్ ఎలా ఉంటే మధ్యతరగతి మహిళలు ప్రారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు. ఇలా నిర్మలా బడ్జెట్ అంచనాలపై MEIL డైరెక్టర్ , ప్రముఖ పారిశ్రామిక వేత్త సుధారెడ్డితో ABP దేశం ప్రత్యేక ఇంటర్వూ..





















