Union Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP Desam
ప్రధాని మోదీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఏదో ఓ క్రిప్టిక్ మెసేజ్ ఇచ్చారా అనిపిస్తోంది. లేదంటే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం ఈ రోజు నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. అది కూడా లక్ష్మీ మంత్రం, లక్ష్మీ జపం, లక్ష్మీ దేవి ఆశీస్సులు ప్రజల మీద ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజల మీదా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మోదీ. ఇదేంటీ మోదీ ఏదన్నా హింట్ ఇస్తున్నారు. చాలా మందికి 2014 గుర్తుకు రాకమానదు. పెద్దనోట్ల రద్దు టైమ్ గుర్తొచ్చినా తప్పులేదు. దేశంలో చాలా మంది నల్ల ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారని అప్పట్లో ఆరోపణలు చేసిన మోదీ..ఆయన అధికారంలోకి రాగానే నల్లడబ్బును వెనక్కి రప్పిస్తామన్నారు. సాధారణ ప్రజల బ్యాంకు అకౌంట్స్ లో వాటిని వేస్తామన్నారు. 1000, 500నోట్లు రద్దు చేసినప్పుడు మోదీ చెప్పింది ఇదే. సో ఇన్నాళ్ల ఇప్పుడు మళ్లీ వార్షిక బడ్జెట్ కి ముందు ఇన్నిసార్లు లక్ష్మీదేవిని తలుచుకోవటం కేవలం భక్తితోనేనా..లేదా బడ్జెట్ లో సాధారణ, మధ్యతరగతి ప్రజల కోసం ఊహించని రీతిలో మోదీ ఏమన్నా తాయిలాలు సిద్ధం చేశారా..? ఇప్పుడు అందరి ఆశా ఇదే.





















