Hardik Pandya Record: అరుదైన జాబితాలో పాండ్యా.. ఇప్పటివరకు కేవలం ముగ్గురికి మాత్రమ సాధ్యమైన ఘనత.. నాలుగో టీ20లో ఫిఫ్టీతో..
తొలుత ఈ జాబితాలో ముగ్గురు ప్లేయర్లు చోటు సాధించారు. బంగ్లాదేశ్ కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్, ఆఫ్గానిస్తాన్ కు చెందిన మహ్మద్ నబీ, జింబాబ్వేకు చెందిన సికిందర్ రాజా స్థానం దక్కించుకున్నారు.

Ind Vs Eng T20 Series: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తాజాగా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 1500 పరుగుల పరుగులు, 50 వికెట్లతోపాటు కనీసం ఐదు ఫిఫ్టీలు చేసిన తొలి భారత ప్లేయర్ గా నిలిచాడు. శుక్రవారం ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20లో పాండ్యా ఈ ఘనత సాధించాడు. 79/5తో జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు దిగిన పాండ్యా.. 27 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. ఓవరాల్ గా 30 బంతుల్లో 53 బాదిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు ఫోర్లు, కళ్లు చెదిరే నాలుగు సిక్సర్లు కూడా ఉన్నాయి. మరో ఆల్ రౌండర్ శివమ్ దూబేతో కలిసి భారత్ భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో అరుదైన ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
Hardik Pandya: India’s clutch performer!🐐🔥 pic.twitter.com/X1l55Oq6jt
— Pavilion Picks (@pavpicks) February 1, 2025
గతంలో ముగ్గురు..
ఇప్పటికే ఈ జాబితాలో ముగ్గురు అంతర్జాతీయ ప్లేయర్లు చోటు సాధించారు. తొలుత బంగ్లాదేశ్ కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్గానిస్తాన్ కు చెందిన మహ్మద్ నబీ, జింబాబ్వేకు చెందిన సికిందర్ రాజా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. తాజాగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. వైట్ బాల్ క్రికెట్ లో తిరుగులేని ఆల్ రౌండర్ గా ఎదిగిన పాండ్యా.. అటు బ్యాట్, ఇటు బంతితోనూ సత్తా చాటి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఇక మూడో టీ20లో చివరివరకు నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడని విమర్శల పాలయ్యాడు. స్లోగా ఆడటంతో ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయిందన్న విమర్శలకు తన బ్యాట్ తో తగిన రీతిలో జవాబిచ్చిన పాండ్యా.. కేవలం 27 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు.
వరుసగా 17వ సిరీస్ కైవసం..
టీ20ల్లో భారత్ తన జోరును ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది సొంతగడ్డపై తొలి టీ20 సిరీస్ ను భారత్ సాధించింది. సొంతగడ్డపై భారత్ కిది వరుసగా 17వ టీ20 సిరీస్ కావడం విశేషం. శుక్రవారం పుణేలో జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లాండ్ పై 15 పరుగులతో విజయం సాధించింది. బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో మళ్లీ గెలుపుబాటలోకి భారత్ ఎక్కింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో భారత్ కు అన్ని కలిసి వచ్చాయి. ముఖ్యంగా చేసిన రెండు మార్పులు చాలా కలిసి వచ్చాయి. బ్యాటింగ్ లో పాండ్యాతోపాటు రింకూ సింగ్, శివమ్ దూబే సత్తా చాటారు. అలాగే కంకషన్ కు గురై దూబే మైదానం వీడగా, అతని స్థానంలో వచ్చిన హర్షిత్ రాణా మూడు వికెట్లతో సత్తా చాటాడు. తాజా విజయంతో సిరీస్ ను 3-1తో భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ లో ఆఖరుదైన ఐదో టీ20 ముంబైలో ఫిబ్రవరి 2 (ఆదివారం) జరుగుతుంది. ఆ తర్వాత ఈనెల 6 నుంచి ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

