Ram Charan: రామ్ చరణ్ మైనపు విగ్రహం లాంచ్ ఎప్పుడంటే? - లండన్ టు సింగపూర్..
Ram Charan Wax Statue: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం రెడీ అయ్యింది. లండన్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ విగ్రహాన్ని మే 9న లాంచ్ చేయనున్నారు.

Ram Charan's Wax Statue Will Unveil On 9th May: 'మగధీర' మూవీతో స్టార్ హీరోగా మారిన రామ్ చరణ్ (Ram Charan).. 'RRR' మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. తనదైన మాస్ యాక్టింగ్, డ్యాన్స్‌తో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న చరణ్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.
ఆ రోజునే ఆవిష్కరణ
రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో లాంఛ్ చేయనున్నారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని శాశ్వతంగా సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. చరణ్‌కు అరుదైన గౌరవం దక్కడంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్‌తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్‌లకు సంబంధించిన కొలతలు, ఫోటోలు, వీడియోలు తీసుకుని ఈ మైనపు బొమ్మను శరవేగంగా తయారు చేశారు.
ఇప్పటికే భారతదేశానికి చెందిన ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ విగ్రహాలను టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. బాహుబలి మూవీ నుంచి ప్రభాస్ రోల్‌ను పోలి ఉండేలా ఈ విగ్రహం ఉంది. ఎంతో గౌరవం, గర్వంగా భావించే ఈ జాబితాలో చరణ్ కూడా చేరిపోయారు.
Also Read: మరోసారి హిట్ కాంబో రిపీట్ - శర్వానంద్ జోడీగా అనుపమ పరమేశ్వరన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో మూవీ రూపొందుతోంది. మూవీలో చరణ్ సరసన అందాల హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.






















