అన్వేషించండి

Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్

Pahalgam Terror Attack : పాకిస్థానీలంతా వెంటనే తెలంగాణ విడిచి పెట్టి వెళ్లిపోవాలని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Pahalgam Terror Attack : తెలంగాణలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులకు డీజీపీ జితేందర్‌ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే పద్ధతిగా దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలని సూచించారు. 29 తర్వాత వీసాలు రద్దు అవుతాయని అన్నారు. తర్వాత చిక్కితే జైలు పాలు అవుతారని వారించారు. అంత వరకు తెచ్చుకోవాలని హితవు పలికారు. 

ఉద్యోగాల నిమిత్తం, ఆసుపత్రికో, బంధువుల ఇంటికో వచ్చిన పాకిస్థానీలు వెంటనే బ్యాగులు సర్దుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌ సూచించారు. కేంద్రం ఆదేశాల మేరకు 29 లోపు వెళ్లిపోవాలని తెలిపారు. అక్రమంగా ఉన్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 

కేంద్రమంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముందుగా డీజీపీ జితేందర్‌తో మాట్లాడినట్టు సమాచారం. కేంద్రం ఆదేశాల మేరకు పాకిస్థానీయులు ఒక్కరు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని అందుకే ఈ చర్యలు ప్రారంభించింది. 

ఉదయం సీఎంలకు ఫోన్ చేసిన అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం దేశంలోని ముఖ్యమంత్రులందరితో మాట్లాడి, వారి రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులను గుర్తించాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పాకిస్తానీ పౌరుల వీసాలను వెంటనే రద్దు చేసి, వారిని భారతదేశం నుంచి పంపడానికి వీలుగా వారి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులను కోరారు.
ప్రభుత్వం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంది

2025 ఏప్రిల్ 22న, పహల్గామ్‌లోని బైసరన్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయ పర్యాటకులు,  ఒక నేపాలీ జాతీయుడు మరణించారు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఈ దాడి ఒకటి. ఈ దాడికి పాకిస్తాన్ ఉసిగొల్పిన ఉగ్రవాదమే కారణమని భారతదేశం ఆరోపించింది.  ప్రతిగా అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. వీటిలో 1960 సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారి-వాఘా సరిహద్దు మూసివేయడం, పాకిస్తాన్ సైనిక అధికారులను న్యూఢిల్లీ నుంచి బహిష్కరించడం, పాకిస్తాన్ పౌరులందరి వీసాలను రద్దు చేసింది.  

వీసా రద్దు విధానం

హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, అమిత్ షా ముఖ్యమంత్రులను వారి రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల జాబితా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. పాకిస్తాన్ పౌరుల ప్రస్తుత వీసాలన్నీ 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు అవుతాయి.  అయితే వైద్య వీసాలు 2025 ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటులో ఉంటాయి. దీనితోపాటు  పాకిస్థాన్‌లో ఉ్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా పాకిస్తాన్ నుంచి తిరిగి రావాలని ప్రభుత్వం సూచించారు.

అధిక ప్రాధాన్యతా క్రమంలో దీన్ని తీసుకోవాలని ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలను కాపాడాలని అమిత్ షా ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారి వీసాలను రద్దు చేసే ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం చేయకూడదని కూడా ఆయన అన్నారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి మరింత క్లోజ్‌ పనిచేస్తోందని సమాచారం.

పాకిస్తాన్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలు

పహల్గామ్ దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారతదేశం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు సైనిక సలహాదారులను బహిష్కరించింది. ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి కుదించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ తన గగనతలంలోకి భారత్ విమానాలను నిషేధించింది. భారతదేశంతో అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ "యుద్ధ చర్య"గా అభివర్ణించింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget