RSS Chief Mohan Bhagwat: బలవంతుడు అవసరమైనప్పుడు బలం చూపించాలి; పహల్గాం ఉగ్రవాద దాడిపై మోహన్ భగవత్ కీలక ప్రకటన
RSS Chief Mohan Bhagwat: పాహల్గాం దాడిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఘాటుగా స్పందించారు. పొరుగు దేశాలకు నష్టం కలిగించే ఆలోచన లేకపోయినా ఉగ్రదాడులు చేస్తే మాత్రం అంతు చూడాల్సిందేనన్నారు.

Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తరువాత దేశంలో పాకిస్థాన్ పట్ల కోపం పీక్స్‌కు చేరుకుంది. భారతదేశం పొరుగు దేశంపైన, ఉగ్రవాదంపై చర్యలు ప్రారంభించింది. ఈ విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా కీలక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి దాడుల చేసిన వారికి బుద్ధి చెప్పడం మన ధర్మం అని ఆయన అన్నారు.
ఆయన మాట్లాడుతూ, "రావణ వధ క్షేమం కోసం జరిగింది. భగవంతుడు అతన్ని సంహరించాడు. ఇది హింస కాదు అహింస. అహింస మన ధర్మం కానీ హింసించేవవారికి వారికి ధర్మం నేర్పడం అహింసే. మనం ఎప్పుడూ మన పొరుగువారికి నష్టం కలిగించం. అయినప్పటికీ ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే ప్రజలను రక్షించడం రాజు కర్తవ్యం. రాజు తన పని చేస్తాడు."
'ధర్మం, అధర్మం మధ్య యుద్ధం'
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మాట్లాడుతూ, "ఈ యుద్ధం ధర్మం, అధర్మం మధ్య జరుగుతోందని గుర్తు చేస్తుంది. ప్రజలను వారి మతం అడిగి వారిని చంపారు. హిందూ మతం ఎప్పుడూ అలా చేయదు. ఇది మన స్వభావం కాదు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేదు కానీ నిశ్శబ్దంగా నష్టాన్ని భరించడం కూడా మన సంస్కృతిలో లేదు. మన గుండెల్లో బాధ ఉంది. మనం కోపంగా ఉన్నాం. చెడును నాశనం చేయడానికి మనం మన బలాన్ని చూపించాలి."
ఆయన ఇంకా మాట్లాడుతూ, "రావణ వధ కూడా జరిగింది ఎందుకంటే అతను తన మనసు మార్చుకోవడానికి నిరాకరించాడు. వేరే మార్గం లేదు. రాముడు అతనిని సంహరించాడు కానీ అతనికి బాగుపడే అవకాశం కూడా ఇచ్చాడు, అతను మారకపోవడంతో అతని వధ జరిగింది."
'బలవంతుడు ఉంటే అవసరమైనప్పుడు బలం చూపించాలి'
మోహన్ భగవత్ మాట్లాడుతూ, " బలమైన ప్రతిస్పందన అవసరం. నిజమైన అహింసావాది బలవంతుడు కూడా కావాలి. బలం లేకపోతే వేరే మార్గం లేదు కానీ బలం ఉన్నప్పుడు అవసరమైనప్పుడు ఆ బలాన్ని చూపించాలి."
ఇవి కూడా చదవండి: భారతదేశం పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుంది? పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తేదీ చెప్పారు





















