బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో బిగ్ ట్విస్ట్..తప్పు ఒప్పుకున్న హైదరాబాద్ మెట్రో.. సిట్ విచారణపై ప్రభావం చూపుతుందా..?
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై ఎట్టకేలకు హైకోర్టులో వాస్తవాలు ఒప్పుకుంది హైదరాబాద్ మెట్రో.నిబంధనలు ఉల్లంఘిచిమరీ బెట్టింగ్ ప్రమోషన్ చేశామని తెలిపింది. ఈ నేపధ్యంలో సిట్ విచారణపై మెట్రో ప్రభావం చూపుతుందా..?

తెలంగాణలో బెట్టింగ్ ప్రమోషన్ ఇటీవల పెను సంచలనం రేపింది. ఏకంగా సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్స్ సైతం బెట్టింగ్ ప్రమోషన్ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించారంటూ విమర్శలు ,కేసులు , విచారణలు ఇలా చకచకా జరిగిపోయాయి. ఇదేదో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని భావించిన రేవంత్ రెడ్డి సర్కార్ , బెట్టింగ్ ప్రమోషన్ ఆగడాలపై సిట్ విచారణకు ఆదేశించింది. అప్పటివరకూ అగ్గిమీద గుగ్గిలంలా బెట్టింగ్ భూతంపై విరుచుకుపడ్డ నోళ్లు, సిట్ విచారణకు ఆదేశించడంతో సైలెంట్ అయ్యాయి. సిట్ విచారణ .. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా ముందుకు సాగుతోంది. ఈ నేధ్యంలో తాజాగా బెట్టింగ్ ప్రమోషన్ పేరుతో గీతదాటామంటూ హైదరబాద్ మెట్రో హైకోర్టులో అంగీకరించింది. నిబంధనలకు విరుద్దంగా మెట్రో రైలులో నిషేధిత బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన మాట వాస్తవమేనంటూ అంగీకరించింది. ఈ నేపధ్యంలో బెట్టింగ్ కేసులో మరో సొరచేప చిక్కినట్లయ్యింది.
బెట్టింగ్ ప్రమోషన్ పై కొోర్టులో మెట్రో ఏమంటోందంటే..?
ఏడాదికి కోటిన్నర్రకుపైగా ప్రయాణికుల రాకపొకలతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రో రైలులో నిషేదిత బెట్టింగ్ యాప్ లు ప్రమోషన్ జరిగిందని, ఈ ప్రమోషన్ ద్వారా కోట్లాది రూపాయలు విదేశీలావాదేవీలు జరిగాయాంటూ, దీనిపై ఈడీ విచారణ కోరుతూ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ న్యాయవాది నాగూర్ బాబు హైకోర్టులో దాఖలు చేసి ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా మెట్రో యాజమాన్యం వాస్తవాలను బయటపెట్టింది. 2022లో తాము నిషేధిత బెట్టింగ్ యాప్ లు మెట్రోోలో ప్రమోషన్ చేేశామని, కానీ ఇప్పుడు అలా చేయడంలేదంటూ కోర్టుకు తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కోరడంతోపాటు , ప్రతివాదులుగా ఉన్న డిజిపి జితేందర్ (డైరెక్టర్ హైదరాబాద్ మెట్రో), సిఎస్ శాంతికుమారి ( చైర్ పర్సన్ HMRL), జిహెచ్ ఎంసీ కమీషనర్ ( డైరెక్టర్ HMRL) వీరు పేర్లను ప్రతివాదుల జాబితా నుండి తొలగించాలని కోరగా, అందుకు కోర్టు నిరాకరిస్తూ, కౌంటర్ దాఖలు చేయడానికి వచ్చే వాయిదా వరకూ అవకాశం ఇచ్చింది.
విచారణపై మెట్రో ప్రభావం చూపుతుందా..?
బెట్టింగ్ యాప్ వల్ల ,బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ సిట్ ఏర్పాటు చేసి , సీరియస్ గా ముందకెళ్తున్న రాష్ట్రప్రభుత్వానికి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో గొంతులో పచ్చివెలక్కాయలా మారింది. అందులోనూ డీజీపి, సిఏస్, జీహెచ్ ఎంసీ కమీషనర్ ఇలా వీరంతా ప్రతివాదులుగా ఉండటంతోపాటు రేపో, మాపో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉండటంతో ,పనిలో పనిగా వీరిని కూడా సిట్ విచారణ చేయాల్సిన అవకాశాలు కనుచూపుమేరలోనే ఉన్నాయి. అదే జరిగితే ఏకంగా సిఎస్ , డిజిపి సైతం సిట్ విచారణ ఎదుర్కొోక తప్పని పరిస్దితి. అటు ఈడీ , ఇటు సిట్ మధ్యలో తెలంగాణ ప్రభుత్వం . ఇలా ముందు చూస్తే నుయ్యి , వెనుక చూస్తే గొయ్యిలా మారింది రేవంత్ సర్కార్ పరిస్దితి. ఇంతలా పెద్దల పేర్లు కూడా నిందితులు లిస్ట్ లో ఉన్నప్పుడు సిట్ విచారణ స్వేచ్చగా , ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేేకుండా ముందుకెళ్తుందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. అలా అని కోర్టులు వదిలేస్తాయా అంటే , సాధ్యం కాని పరిస్దితి. ఇప్పటికే మెట్రో ఎండీకి నోటీసులు జారీచేసిన తెలంగాణ హైకోర్టు , బెట్టింగ్ ప్రమోషన్లు, నగదు లావాదేవీలపై పూర్తి స్దాయి నివేదిక కోిరింది. మెట్రోలో బెట్టిొంగ్ ప్రమోషన్ కోసం డబ్బులు చెల్లించిన సంస్దలు విదేశీ కంపెనీలు కావడం, నగదుకూడా దేశం సరిహద్దులు దాటి లావాదేవీలు జరగడంతో ఈడీ సైతం రంగంలోకి దిగక తప్పని పరిస్దితి నెలకొంది. ఇలా మొత్తానికి హైకోర్టులో దాఖలైన పిల్ తిరిగి ప్రభుత్వం మెడకే చుట్టుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఒత్తిడితో సిట్ ముందుకు వెళుతుందా, లేదా లైట్ తీసుకుంటే గొడవేలేదన్నట్లుగా విచారణ విషయంలో కాస్త స్పీడ్ తగ్గించి, నెమ్మదిగా అటకెక్కిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






















