అన్వేషించండి

Significance of Tirupati Gangamma Jatara : గంగమ్మ జాతరలో స్త్రీల రూపంలో పురుషులు, ఈ వేషధారణ వెనుక కారణం తెలిస్తే పూనకాలు లోడింగ్!

చీపుర్లతో కొడతారు, బూతులు తిడతారు, పురుషులంతా స్త్రీలుగా మారిపోతారు. వారం పాటూ అక్కడంతా చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఎందుకో తెలియాలంటే గంగమ్మ జాతర వెనుకున్న ఆంతర్యం తెలుసుకోవాలి...

importance and significance of  Gangamma Jatara :  మగవాళ్లంతా చీరలు కడతారు అందంగా అలంకరించుకుంటారు..ఆడవారంతా మగరాయుడిలా మారిపోతారు...అమ్మోరు తల్లిగా కొందరు.. రాక్షసులుగా మరికొందరు..మీసకట్టుతో పిల్లలు...దుస్తులకు బదులు వేప మండలు చుట్టుకుని మరికొందరు..డప్పు చప్పుళ్లు, చిత్ర విచిత్ర వేషాలు...వారం రోజల పాటూ ఎక్కడ చూసినా పూనకాలు లోడింగ్ అన్నట్టే ఉంటుంది. ఇలా ఉండటమే గంగమ్మకి ఇష్టమట..అలా ఉంటేనే అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయట. తిరుపతి గంగమ్మ భక్తుల విశ్వాసం అది. దీనిని తాతగట్టు జాతర అనికూడా అంటారు. ఇంతకీ ఈ వేషాలన్నీ ఎందుకేస్తారు..ఆ తిట్టుకోవడం ఏంటి.. చీపుర్లతో కొట్టుకోవడం ఏంటో తెలియాలంటే గంగమ్మ జాతర వెనుకున్న ఆంతర్య తెలుసుకోవాలి...

Also Read: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!

ఏటా డిసెంబరు నెల వచ్చేసరికి గంగమ్మ జాతర గురించి చర్చల సందడి మొదలైపోతుంది. జాతర జరిగేది మే నెల మొదటి మంగళవారం అయినప్పటికీ...దాదాపు 4 నెలల ముందుగానే..అంటే డిసెంబరులో వచ్చే రెండో ఆదివారం అర్థరాత్రి చాటింపు వేసి తేదీలు ప్రకటించేస్తారు. ఎందుకంటే..ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా జాతర సమయానికి స్వస్థలాలకు చేరుకోవాలన్నది ఓ కారణం కాగా... వారం పాటూ వైభవంగా జరిగే జాతరకు ఏర్పాట్లు చేసుకోవాలంటే ఆమాత్రం సమయం ఉండాలి మరి. వందల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న ఈ జాతరకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రవాసులు కూడా భారీగా తరలివస్తారు. 

తిరుమల వేంకటేశ్వరుడికి చెల్లెలు గంగమ్మ

తిరుపతి నగరంలో కొలువు తీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అంకాళమ్మ, మాతమ్మ, ఉప్పంగి మారెమ్మ, తాళ్ళపాక పెద గంగమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, గంగమ్మలకు జాతర కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. గంగమ్మను శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలిగా భావిస్తారు. అందుకే టీటీడీ తరపున అమ్మవారికి పట్టుచీర సమర్పిస్తారు అధికారులు. మే నెల మెుదటి మంగళవారం అర్థరాత్రి కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమంతో జాతర మెుదలవుతుంది..ఆ తర్వాత మంగళవారానికి జాతర పూర్తవుతుంది. అయితే ఈ వారం రోజులు మాత్రం ఊర్లోంచి ఎవ్వరూ పొలిమేర దాటి వెళ్లరు. 

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!

చిత్ర విచిత్ర వేషాలు ఎందుకేస్తారంటే!

రాయలసీమలో పాలేగాళ్ళ రాజ్యం నడుస్తున్న రోజుల్లో తిరుపతిని పాలించే పాలెగాడి అరాచకత్వానికి అంతుండేది కాదు. తిరుపతి పాలెగాడి కన్నుపడిన  మహిళా తప్పించుకునే అవకాశం ఉండేది కాదు. ఆ కామాంధుడి బారినుంచి మహిళలను తప్పించేందుకు ప్రజలు నానా కష్టాలు పడేవారు. తిరుపతికి సమీపం అవిలాల గ్రామంలోని కైకాల కులస్థుల ఇంట్లో పుట్టిన ఓ ఆడబిడ్డను తిరుపతికి చెందిన ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు..ఆమె పేరు గంగమ్మ. ఓ సారి పాలిగాడి కన్ను గంగమ్మపై పడింది... ఆమెను బలవంతం చేయబోతుండగా ఉగ్రరూపం దాల్చిన గంగమ్మ పాలెగాడిని సంహరించేందుకు వెంటాడింది. భయపడిన పాలెగాడు దాక్కున్నాడు..తనని బయటకు రప్పించేందుకు వారం రోజుల పాటూ రకరకాల వేషాలు వేసుకుని వెతికింది గంగమ్మ. బైరాగిగా, మాతంగిగా ఇంకా రకరకాల వేషాలు వేసుకుని తిరిగింది. చివరిగా దొర వేషంలో వెళ్లడంతో...తన దొరే వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రావడంతో విశ్వరూపం చూపిన గంగమ్మ ఆ రాక్షసుడిని సంహరించింది. మరుసటి రోజు మాతంగి వేషధారణలో వెళ్లి పాలెగాడి భార్యని ఓదార్చుతుంది. దుష్టుడైన పాలెగాడిని సంహరించిన గంగమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావించి జాతర చేయడం ప్రారంభించారు. 

అమ్మవారి అనుగ్రహం దక్కాలంటే

అమ్మవారి అనుగ్రహం దక్కాలంటే చెడుని సంహరించేందుకు రకరకాల వేషధారణలో అమ్మవారు తిరిగినట్టే ఆ వారం రోజులు జనం కూడా అలాగే ఉంటారు. అలా ఉంటేనే అమ్మ కృపకు పాత్రులవుతాం అని భావిస్తారు. మహిళలంతా వీధుల్లో ఆడిపాడుతారు,మగవారంతా చీరలు కడతారు, రకరకాలుగా తయారవుతారు...(పుష్ప 2 బన్నీ లుక్ కూడా ఇదే), పిల్లలంతా మీసాలు పెట్టుకుని పెద్దవారైపోతారు.. కనిపించిన వారిని బూతులు తిడుతుంటారు, చీపుర్లు-చేట్లతో కొడుతుంటారు. పాలెగాడి పనిపట్టిన గంగమ్మకు మొక్కులు చెల్లిస్తే ఎంత పెద్ద ఆపదనుంచైనా బయటపడతాం అన్నది అక్కడి ప్రజల విశ్వాసం. అప్పట్లో గంగమ్మను దర్శించుకున్నాకే శ్రీ వేంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లేవారట..ఇప్పటికీ చాలామంది ఇదే సంప్రదాయం పాటిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Harish Rao Arrested : మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ఉద్రిక్తత
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ఉద్రిక్తత
Vajedu SI Harish Suicide Case: వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
Pushpa 2 Dialogues: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Harish Rao Arrested : మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ఉద్రిక్తత
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ఉద్రిక్తత
Vajedu SI Harish Suicide Case: వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
Pushpa 2 Dialogues: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
Pushpa 2 Review - పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
Telangana: ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం
ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం కార్యక్రమాలు
Pushpa 2 Benefit Show Stampede: కుటుంబంలో విషాదం నింపిన పుష్ప 2 బెనిఫిట్‌ షో - తల్లి మృతి, కుమారుడి పరిస్థితి విషమం
కుటుంబంలో విషాదం నింపిన పుష్ప 2 బెనిఫిట్‌ షో - తల్లి మృతి, కుమారుడి పరిస్థితి విషమం
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Embed widget