News
News
వీడియోలు ఆటలు
X

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!

ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 23 ఆదివారం వచ్చింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీపూజ చేస్తే మంచిదని భావిస్తారు కానీ వాస్తవానికి అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు..ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి

FOLLOW US: 
Share:

 Akshaya Tritiya 2023: హిందువుల పండుగలలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున  హిందువులు, జైనులు ఈ పండుగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది తిథులు తగులు మిగులు రావడంతో అక్షయ తృతీయ ఎప్పుడు అనే సందేహం అందర్లోనూ నెలకొంది. ఇంతకీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియాలంటే ముందుగా తదియ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉందో చూడాలి...

  • ఏప్రిల్ 22 శనివారం ఉదయం..అంటే సూర్యోదయానికి విదియ తిథి ఉంది...ఈ రోజు ఉదయం 8.15 నిముషాలు దాటిన తర్వాత తదియ వస్తోంది...అంటే సూర్యోదయం సమయానికి తదియ లేదు
  • ఏప్రిల్ 23 ఆదివారం సూర్యోదయానికి ఉన్న తదియ తిథి...8.15నిముషాలు దాటిన తర్వాత పూర్తై..చవితి వచ్చేస్తోంది...
  • ఇక్కడే డైలమా మొదలైంది.. శనివారం రోజు సూర్యోదయానికి తదియ తిథి లేకపోయినా రోజంతా ఉంది కాబట్టి శనివారం అని కొందరంటే... హిందువుల పండుగలకు సూర్యోదయం తిథి లెక్క కాబట్టి ఆదివారం జరుపుకోవాలని ఇంకొందరు పండితులు చెబుతున్నారు.
  • చాలామంది మాత్రం ఏప్రిల్ 23 ఆదివారం సూర్యోదయానికి తదియ తిథి ఉండడంతో ఈ రోజే జరుపుకుంటున్నారు.

Also Read: భర్తలకు గుడ్ న్యూస్ - అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!

అక్షయ తృతీయ ఎందుకు ప్రత్యేకం
అక్షయ తృతీయ రోజు చేసే ప్రతి పనీ ఎందుకు ప్రత్యేకం, వాస్తవానికి అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకం అంటే..శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న మంచి రోజు కూడా ఇదే. అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతుందని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనడం కన్నా..ఈ రోజు చేసే దానాలు, జపాలు రెట్టింపు ఫలితాన్నిస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్టు శివపురాణంలో ఉంది. 

నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే అని చెబుతారు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజున రాహుకాలాలూ, వర్జ్యాలు , దుర్ముహూర్తాలు, యమగండాలు  వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది. ఒకటో రెండో కాదు  అక్షయ తృతీయకు ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంది...

  • పరశురాముడు జన్మించింది అక్షయతృతీయ రోజే
  • పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా ఈ రోజే
  • శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడిని కలుసుకున్న రోజు అక్షయతృతీయ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు
  • వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయముతో రాయడం మొదలెట్టింది అక్షయ తృతీయ రోజే
  • వనవాసం చేస్తున్న పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే
  • శివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజే
  • కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు "కనకధారాస్త్రోత్రం" చెప్పిన దినం ఇదే
  • అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ
  • ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ
  • బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది
  • సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ

Also Read: ప్రతియుగానికి 4 లక్షల సంవత్సరాలు ఎందుకు తగ్గుతూ వచ్చింది, ఇంకా కలియుగం ఎన్నాళ్లుంది

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

Published at : 13 Apr 2023 10:33 AM (IST) Tags: Akshaya Tritiya bangaram Gold akshaya tritiya 2023 chandanotsavam simhachalam 2023 importance and significance of Akshaya Tritiya When to celebrate Akshaya Tritiya April 22 or April 23 Akshaya Tritiya date and time 2023

సంబంధిత కథనాలు

12 Zodiac Signs Personality Traits: మీ తీరు ఎలా ఉంటుందో మీ రాశి చెప్పేస్తుంది!

12 Zodiac Signs Personality Traits: మీ తీరు ఎలా ఉంటుందో మీ రాశి చెప్పేస్తుంది!

జూన్ 10 రాశిఫలాలు, ఈ రాశివారు బలహీనతలను కవర్ చేసుకోవడం మానేస్తే మంచిది

జూన్ 10 రాశిఫలాలు, ఈ రాశివారు బలహీనతలను కవర్ చేసుకోవడం మానేస్తే మంచిది

Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!

Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!

Chanakya Niti: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధ‌మే

Chanakya Niti: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధ‌మే

Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!

Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?