News
News
వీడియోలు ఆటలు
X

Simhachalam Chandanotsavam 2023: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!

చందనోత్సవం: ఏటా వైశాఖ శుక్ల తదియ రోజు సింహాచలం వరాహ లక్ష్మీనారసింహ స్వామి చందనోత్సవం జరుగుతుంది. స్వామిపై చందనం పూత తొలగించి నిజరూప దర్శనభాగ్యాన్ని భక్తులకు అందిస్తారు. ఈ చందనోత్సవం ప్రత్యేకత ఏంటంటే

FOLLOW US: 
Share:

Simhachalam Chandanotsavam 2023: శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే వరాహం, నరసింహ అవతారాలు కలిసున్న విగ్రహం కొలువైన దేవాలయం కేవలం సింహాచలంలో మాత్రమే ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భావిస్తారు భక్తులు. ఈ స్వామి దర్శనమే మహాభాగ్యంగా భావిస్తారు..అలాంటి స్వామి నిజరూపం దర్శనం అంటే ఇంకెంత అదృష్టమో. ఈ దర్శన భాగ్యం ఏడాదికి ఓసారి కలుగుతుంది...అదే  వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. 

చందనోత్సవం వెనుకున్న పురాణ గాథ
హిరణ్యాక్షుడనే రాక్షసుడిని వధించేందుకు శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని,  హిరణ్యకశిపుణ్ని సంహరించేందుకు  నృసింహావతారాన్ని దాల్చాడు. అసురులైన అన్నదమ్ములు ఇద్దర్నీ వధించేందుకు శ్రీహరి వరుసగా ధరించిన అవతారాలివి.  హిరణ్యాక్షుడిని వధించి వరాహ అవతారాన్ని విరమించేలోగా  హిరణ్యకశిపుడి మాట మేరకు ప్రహ్లాదుడు పిలవడంతో భక్తుడిని రక్షించాలనే తొందర్లో వరాహ రూపం వదలకుండానే  నృసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు.  అయితే  హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నృసింహుడు ప్రళయ భీకరంగా, జ్వాలా మాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడింది. బ్రహ్మాది దేవతలు, ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో బ్రహ్మకు చందన వృక్షం గుర్తొచ్చింది. ఉగ్రం, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి వరంగా ఇచ్చిన సంగతి గుర్తుకొచ్చి అదే విషయం ప్రహ్లాదుడికి సూచించాడు బ్రహ్మ. అప్పుడు ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల  నారసింహుడు శాంతించాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహం, నృసింహ రూపంలో సింహగిరిపై కొలువయ్యాడు. ఇదంతా అక్షయ తృతీయ రోజు జరిగింది.

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!

పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ 
‘పాహీ! శ్రీమన్నారాయణ!’ అని ప్రహ్లాదుడు పిలవగానే, గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామివారి పాదాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నారసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు.  ప్రహ్లాదుడి తదనంతరం  కాలక్రమంలో వరాహ నారసింహకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. ఆ తర్వాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి  అక్క డే బస చేయడంతో...స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ఉత్సవం చేయాలని కోరాడు. పురారవ చక్రవర్తి ఎంత వెతికినా ఫలితం ఉండదు..రెండో రోజు మళ్లీ కనిపించిన స్వామివారు తాను 12 అడుగులున్న పుట్టలో ఉన్నానని చెబుతాడు. అలా స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్టు చెబుతారు. స్వామి 12 అడుగుల పుట్టలో వచ్చినందుకు గుర్తుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు. అలా పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ  ఏటా అక్షయ తృతీయనాడు  వైభవంగా సింహాద్రిపై కొనసాగుతోంది. 

Also Read: భర్తలకు గుడ్ న్యూస్ - అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!

శ్రీ మహావిష్ణువు అవతారం - లింగ రూపంలో దర్శనం
వరాహ ముఖం, నరుని  శరీరం, తెల్లని జూలు, రెండు చేతులు, భూమిలో దాగివున్నపాదాలు.. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటలు సేపు ఉంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం తిరిగి చందనం లేపనం చేయడంతో  శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక.  అక్షయ తృతీయతోపాటు, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ, పౌర్ణమి తిథుల్లో మూడు విడతల్లో స్వామికి మొత్తం 12 మణుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు. స్వామి చల్లగా ఉంటేనే జగమంతా చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం.

ఈ ఏడాది (2023) ఏప్రిల్ 23 ఆదివారం చందనోత్సవం జరుగుతుంది

Published at : 13 Apr 2023 12:36 PM (IST) Tags: Akshaya Tritiya akshaya tritiya 2023 chandanotsavam simhachalam 2023 importance of Simhachalam Chandanotsavam significance of Simhachalam Chandanotsavam

సంబంధిత కథనాలు

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి  ఎప్పుడొచ్చింది,  ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి

మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి

గంగా దసరా అంటే ఏమిటీ? దీని వెనుకున్న కథ ఏమిటి?

గంగా దసరా అంటే ఏమిటీ? దీని వెనుకున్న కథ ఏమిటి?

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!