1. పరస్త్రీ వ్యామోహం: సీతాదేవిని అపహరించుకుపోయి కోరి కష్టాలు తెచ్చుకున్నాడు రావణుడు. కుటుంబాన్ని, వంశాన్ని, అయినవారినీ, చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయాడు.
2. జూదం: ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. తాను అవస్తలు పడడంతో పాటూ తమ్ముళ్లు, భార్య కష్టాలకు కూడా కారణమయ్యాడు.
3. మద్యపానం: మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో శిష్యుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు రాక్షస గురువు శుక్రాచార్యుడు.
4. వేట: వేటకు వెళ్లిన దశరథుడు ఓసారి నీటి శబ్దం విని బాణ వేసినప్పుడు శ్రవణకుమారుడు బలైపోతాడు. అప్పుడు శాపానికి గురైన దశరధుడు…వనవాసానికి వెళ్లిన శ్రీరాముడిని కలవరిస్తూ మరణిస్తాడు.
5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం: మహాభారంతో దుర్యోధనుడు పాండవులను దుర్భాషలాడి ఏ స్థితికి చేరాడో పెద్దలు చెబుతుంటారు.
6. కఠినంగా దండించటం: తన తాతగారిని, మేనమామలని బంధించిన దుర్యోధనుడు చివరకు శకుని ద్వారా నాశనమయ్యాడు
7. డబ్బు: లక్ష్మీదేవిని నువ్వు గౌరవిస్తే…అమ్మవారు నిన్ను కరుణిస్తుందని అంటారు పెద్దలు.