Dussehra Navratri 2024: దేవినవరాత్రులు ప్రారంభం - అక్టోబరు 03 మొదటి రోజు అలంకారం , నైవేద్యం!
Dussehra 2024: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 03 గురువారం మొదటి రోజు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపురసుందరి అలంకారం..ఈ రోజు పూజా విధానం, నైవేద్యం ఏం సమర్పించాలో తెలుసుకుందాం..
![Dussehra Navratri 2024: దేవినవరాత్రులు ప్రారంభం - అక్టోబరు 03 మొదటి రోజు అలంకారం , నైవేద్యం! dussehra 2024 first day sri bala tripura sundari alankaram is the day of kumari pooja Dussehra Navratri 2024: దేవినవరాత్రులు ప్రారంభం - అక్టోబరు 03 మొదటి రోజు అలంకారం , నైవేద్యం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/01/325212266061d394b0b786108dc87f8b1727796766847217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Goddess Sri Bala Tripura Sundari: అక్టోబరు 03 గురువారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. కొందరు శ్రీశైల భ్రమరాంబికకు వేసే నవదుర్గల అలంకారాలను పూజిస్తే మరికొందరు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అలంకారాలను అనుసరిస్తారు. ఏ అలంకారాన్ని పూజించినా అన్నీ చేరుకునేది శక్తి స్వరూపిణికే. కనకదుర్గ ఆలయంలో మొదటిరోజు అలంకారం శ్రీ బాలాత్రిపురసుందరి. ఈ రోజు అమ్మవారికి పొంగల్ నైవేద్యంగా సమర్పిస్తారు
శ్రీ బాలత్రిపురసుందరిదేవి
సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్
అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్
నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు 9 శక్తులు ఉంటాయని దేవీ పురాణం వివరిస్తోంది. ఆ 9 శక్తులలో ఒకటి బాలా త్రిపురసుందరి. ఈ రోజు బాలాత్రిపుర సుందరి అలంకారం వేసి చిన్నారులకు కౌమారీ పూజ చేస్తారు.
Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు
అమ్మవారు 3 రూపాల్లో దర్శనమిస్తుంది
కుమారిగా బాలత్రిపుర సుందరి
యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి
వృధ్ధరూపంలో త్రిపురభైరవి
సరస్వతిదేవీ విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నదే బాల రూపం. ఈమె ఆనందప్రదాయిని..బాల్యంలో నిర్మలత్వానికి ప్రతీక బాలా త్రిపుర సుందరి. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనసు,బుద్ధి కుదురుగా ఉంటాయి. షోడస విద్యకు అధిష్టాన దేవత అయిన బాల అనుగ్రహంకోసం ఉపాసకులు శరన్నవరాత్రుల్లో బాలార్చన చేస్తారు. శ్రీ చక్రంలో మొదటి దేవత అయిన బాలను పూజిస్తే సత్సంతానం కలుగుతుంది.
బాలాత్రిపుర సుందరి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో ఏం ఉందంటే..
భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది సంతానం..వీళ్లంతా అవిద్యా వృత్తులకు సంకేతంగా మారి దేవతలను హింసించడం ప్రారంభించారు. హంసలులాగే రథంపై వచ్చిన బాలాత్రిపురసుందరి భండాసురుడితో పాటూ 30 మంది పుత్రులను కేవలం అర్థచంద్రాకార బాణంతో సంహరించింది. బాల శక్తి తక్కువకాదంటూ అప్పటి నుంచి చిన్నారి అమ్మను ఆరాధించడం ప్రారంభించారు.
Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!
రెండేళ్ల బాలిక నుంచి తొమ్మిదేళ్ల వయసు ఉన్నవారి వరకూ బాలపూజ చేయొచ్చు
మూడేళ్ల బాలికను పూజిస్తే ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి
నాలుగేళ్ల బాలికను పూజిస్తే రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి
ఐదేళ్ల బాలికను పూజిస్తే ఆరోగ్యం
ఆరేళ్ల బాలికను పూజిస్తే శత్రునాశనం
ఏడేళ్ల బాలికను పూజిస్తే ఐశ్వర్యం
ఎనిమిదేళ్ల బాలికను పూజిస్తే సర్వకార్యజయం
తొమ్మిదేళ్ల బాలికను పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!
శ్రీ బాలా త్రిపురసుందరి స్తోత్రం
కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం
నితంబ జిత భూధారం సురనితంబిని సేవితాం
నవంబురుహ లోచనం అభినవాంబుదా శ్యామాలాం
త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే
కదంబవన వాసినీం కనకవల్లకీ ధారణీం
మహార్షమణి హారిణీం ముఖసముల్ల సద్వారుణీం
దయా విభవ కారిణీం విశదలోచనీం చారిణీ
త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయ
కందబ వన శాలయా కుఛ బరోల్ల సన్మాలయా
కుచో పామిత శైలయా గురుకృపాల సద్వేలయా
మదారుణ కపోలయా మధురగీత వాచాలయా
కయాపి ఘన లీలయా తపచితవయం లీలయా
కందబ వన మధ్యగం కనక మండలోపస్థితాం
షడంబ రుహ వాసినీం సతత సిద్దసౌదామినీం
విడంబిత జపారుచిం వికచచంద్ర చూడామణీం
కుచాంచిత విపంచితాం కుటిల కుంతలాలంకృతం
కుశే శయనివాసినీం కుటిల చిత్తవిద్వేషణీం
మదారణ విలోచనాం మనసి జారి సంమోహినీం
మాతంత ముని కన్యకాం మధుర భాషిణి మాశ్రయే
స్మరతే ప్రథమ పుష్టిణీం రుధిర బిందు నీలాంబరాం
గ్రుహిత మధు పాత్రికాం మధు విఘూర్ణ నేత్రంచలం
ఘనసథిన భారోనతాం గలిత చూలికాం శ్యామలాం
త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే
సకుంకుమ విలేపనాం అళిజ చుంబి కస్తూరికాం
సమందహసితేక్షణాం సచర చాప పాశాంకుశాం
అశేష జన మోహినీం అరుణ మాల్య భూషాంబరాం
జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం
పురందర పురంధ్రికాం చికుర బంధ సైరంధ్రికాం
పితామహ పతివ్రతాం పటు పటీర చర్చారతాం
ముకుంద రమణీమణి లసదలంక్రియా కారిణీం
భజామి భువానాంబికాం సురవధూటితా చేటికాం
ప్రథమ శైలపుత్రీచః
వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం||
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)