అన్వేషించండి

Vehicle Insurance Check : టోల్‌గేట్స్‌కు కొత్త బాధ్యతలు- కారు ఓనర్లకు దబిడిదిబిడే- ఇన్సూరెన్స్ లేకపోతే జైలుకే!

Insurance Verification System At Toll Plaza: ఇన్సూరెన్స్ లేకుండా మీ వెహికల్‌తో టోల్‌గేటు దాటితే వాత ఖాయం. మొదటిసారి అయితే 2 వేలు, రెండోసారి 4 వేలు జరిమానా. జైలు శిక్ష కూడా పడొచ్చు.

Vehicle Insurance: కారు, బైక్‌ ఇలా ఏ వాహనం ఇన్నా దాన్ని డిజైన్ నుంచి ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా చూసుకనే వ్యక్తులు ఓ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. అదే ఇన్సూరెన్స్. ఇకపై అలా చేయడం కుదరదు. ముఖ్యంగా కారు సహా భారీ వాహనాలు కలిగి ఉన్న వాళ్లు ఇకపై కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించాల్సిందే. లేకుంటే భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. 

టోల్‌గేట్లకు ఇన్సూరెన్స్‌ చెకింగ్ బాధ్యత

ఇలా ఇన్సూరెన్స్‌ గుర్తింపు బాధ్యతను టోల్‌గేట్స్‌కు కేంద్రం అప్పగించింది. ఇప్పటి వరుక కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. మొదటగా ఒడిశా రాష్ట్రంలో ఉన్న టోల్‌గేట్‌లకు ఈ డిటెక్షన్ పరికరాలు అమర్చారు. ఇది వచ్చిన వాహనానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో క్షణాల్లో చెప్పేస్తోంది. ఇన్సూరెన్స్ లేకుంటే వెంటనే ఫోన్ మోగుతుంది. ఇన్సూరెన్స్ లేని కారణంగా మీరు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు అందులో ఉంటుంది. 

టోల్‌గేట్‌ దాటితే జరిమానా మెసేజ్‌

దేశంలోని దాదాపు అన్ని వాహనాల నెంబర్లు డిజిటర్ అయిపోయాయి. ఒక నెంబర్‌ డేటా బేస్‌తో చూసుకుంటే అన్ని వివరాలు వచ్చేస్తున్నాయి. ఆ వాహనం కండీషన్ కూడా వచ్చేస్తే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందో లేదో తెలిసిపోతోంది. అందుకే ఇప్పుడు టోల్‌ గేట్లకు ఈ రెండు గుర్తించే బాధ్యత అప్పగించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఒడిశాలోని 22 టోల్‌గేట్‌లో ఈ డిటెక్షన్ విధానం అమలులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ లేని వాళ్లకు టింగ్‌న మెసేజ్ వస్తోంది. 

పొలూష్యన్, ఇన్సూరెన్స్‌పై ఫోకస్

చాలా మంది లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వాహనాలు కొంటున్నా వేలు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు. అలాంటి వారిని దారిలో పెట్టేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఇన్సూరెన్స్‌ లేకుండా తిరగడంతో ప్రమాదకరమని అంటున్నారు. మరికొన్ని వాహనాలుకు కాలుష్యం సర్టిఫికేట్ ఉండటం లేదని అంది కూడా చేటు చేస్తోందని వివరిస్తున్నారు. ఈ రెండు లోపాలు కట్టడి చేసేందుకు టోల్‌గేట్లకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది కేంద్రం. 

Also Read: లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు అదిరిపోయే మైలేజీ, ఫీచర్లు ఉండే బైక్‌లు ఇవే

ఈ డిటెక్షన్ విధానంతో గుర్తింపు

టోల్‌గేట్ల వద్ద అమర్చిన ఈ డిటెక్షన్ విధానంతో ఇప్పుడు టోల్‌ ఛార్జ్ కట్‌ అయినట్టుగానే పని చేస్తుంది. వాహనం నెంబర్ చూసి ఆ వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉందో లేదో పరిశీలిస్తుంది. ఇన్సూరెన్స్ లేకుంటే వెంటనే ఆ వాహనం రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్‌కు జరిమానా మెసేజ్ వస్తుంది. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి చిక్కితే 2000 రూపాయల ఫైన్ వేస్తారు. లేకుంటే మూడు నెలలు జైలు శిక్ష విధించవచ్చు. లేదంటే రెండూ విధించే ప్రమాదం కూడా ఉంది. రెండోసారి చిక్కితే దాన్ని రెట్టింపు చేస్తారు. అంటే నాలుగు వేల ఫైన్ వేస్తారు. 

ఒడిశా, బిహార్‌లో అమలు

ఒడిశాలో ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. అంతకు ముందే బిహార్‌లో కూడా అమలులోకి వచ్చింది. అక్కడ మొత్తం 32 టోల్‌ గేట్ల వద్ద దీన్ని అమర్చి ఉన్నారు. ఒడిశాలో ప్రస్తుతానికి ఇన్సూరెన్స్‌ లేకుంటే మాత్రమే జరిమానా వేస్తున్నారు. బిహార్‌లో పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా ఫైన్ కట్టించుకుంటున్నారు. పది వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీంతో బెదిరిపోయిన వాహనదారులు పొల్యూషన్ సర్టిఫికేట్స్ కోసం, ఇన్సూరెన్స్‌ కోసం పరుగులు తీస్తున్నారు.  దీంతో టోల్‌గేట్ల వద్ద ఇప్పటి వరకు ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్‌ సెంటర్‌లే ఉండేవి ఇప్పుడు ఇన్సూరెన్స్‌, పొల్యూషన్ చెకింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. 

Also Read: రూ.7 లక్షల బడ్జెట్‌లో కారు కోసం చూస్తున్నారా? ఈ లిస్ట్‌ ఒక్కసారి పరిశీలించండి !

టాప్ హెడ్ లైన్స్

Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
హోండా ADV160 vs హీరో Xoom 160 vs యమహా Aerox 155 - యూత్‌కి తగిన స్కూటర్‌ ఏది?
జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
యువతకు కవాసాకి బంపర్ గిఫ్ట్.. Z900 కొంటే ఇవి కూడా 'ఫ్రీ'గా మీ సొంతం!
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget