KP Chowdary Committed Suicide : చిత్ర పరిశ్రమలో విషాదం.. గోవాలో 'కబాలి' సినిమా నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య
KP Chowdary Committed Suicide : గోవాలో సినీ నిర్మాత కే.పి చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో గతంలో అరెస్ట్ అయిన ఈ నిర్మాత సూసైడ్ చేసుకున్నారు.

Kabali Film Producer KP Chowdary is Committed Suicide : టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కబాలి సినిమా ఫేమ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి (Sunkara Krishna Prasad Chowdary) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసు (Tollywood Drugs Case)లో అరెస్ట్ అయిన కేపీ చౌదరి సోమవారం సూసైడ్ (KP Chowdary Committed to Suicide) చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. గోవాలోని ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడి ఉన్న ఆయనను సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరిగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన 2016లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన కబాలి చిత్రానికి సహా నిర్మాతగా చేశారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో వెంకటేష్, మహేశ్ బాబు మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu), పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సర్థార్ గబ్బర్ సింగ్ (Sardhar Gabbar Singh), అర్జున్ సురవరం (Arjun Suravaram) వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు.
డ్రగ్స్ కేసులో..
టాలీవుడ్లో డ్రగ్స్ కేసులు తీవ్రమైన చర్చకు దారి తీశాయి. కేపీ చౌదరి డ్రగ్స్ క్రయవిక్రయాల్లో కీలకంగా ఉన్నారనే ఆరోపణలతో 2023లో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి తనిఖీల్లో భాగంగా.. అతని దగ్గర నుంచి 87.75 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 90 కొకైన్ ప్యాకెట్లు, రెండు లక్షలకు పైగా నగదు, నాలుగు మొబైల్స్, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్‌ల డేటాను తీసుకుని.. ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పట్లో ఇదే సెన్సేషనల్ న్యూస్‌గా మారింది.

ఆర్థిక సమస్యలే కారణమా?
కేపీ చౌదరి అరెస్ట్ తర్వాత బయటకు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గోవా వెళ్లిన ఆయన.. అక్కడ హోటల్ తీసుకున్నారు. హోటల్ సిబ్బంది ఎంత పిలిచినా కేపీ చౌదరి రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలనాలు బయటికి, కీలక పేర్లు తెరపైకి! వీళ్లతో వందల ఫోన్ కాల్స్






















