Balakrishna Comments: నాకు పద్మభూషణ్ కాదు, నాన్నకు భారతరత్న రావాలి: బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
Bharat Ratna For NTR | ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు అనేది తెలుగు వారి ఆకాంక్ష అని, ఆయనకు తప్పకుండా అవార్డు వస్తుందని నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

Hindupur MLA Balakrishna | హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తనకు పద్మభూషణ్ రావడం కాదు, నాన్న (NTR)కు భారతరత్న రావాలి అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు కంటే... నాన్నకు భారతరత్న అవార్డు రావాలనేది కోట్లాది మంది తెలుగు వారి ఆకాంక్ష అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు కచ్చితంగా వస్తుందని నందమూరి బాలకృష్ణ ఆశాభవం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్నను తెలుగు ప్రజలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తనకు పద్మభూషణ్ అవార్డు రావడంపై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనలో కసిని పెంచిందని, ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్ గా భావిస్తానని చెప్పారు. ‘ప్రేక్షకులు నా సినిమాల్ని ఆదరించారని, వారి ప్రేమ, ఆధరాభిమానాలతో ఎన్నో పాత్రలు పోషించాను. ప్రతి పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ, నన్ను నేను మెరుగు పరుచుకున్నాను. నన్ను నేను అర్థం చేసుకుంటూ, ముందుకు సాగుతుంటా. ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పకుండా వస్తుంది. ఆయనకు భారతరత్న తెలుగువారి కల, ఆకాంక్ష. అది ఎప్పటికైనా నెరవేరుతుందని’ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
హిందూపురం మున్సిపాలిటీ టీడీపీదే..
హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీకి కంచుకోట అయిన హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా రమేష్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి రమేష్ కు 23 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి 14 ఓట్లు వచ్చాయి. ఆరో వార్డు కౌన్సిలర్ అయిన సురేష్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పాల్గొని ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటు వేశారు. ముగ్గురు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో జై బాలయ్య అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

