అన్వేషించండి
Paris Olympics 2024: స్వదేశానికి మను బాకర్, ఢిల్లీలో ఘన స్వాగతం
Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత యువ షూటర్ మను భాకర్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆమెకు ఘన స్వాగతం లభించింది.

స్వదేశానికి మను బాకర్
1/8

పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు సాధించిన భారత్ యువ షూటర్ మను బాకర్ స్వదేశం చేరుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
2/8

భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఢిల్లీ విమానాశ్రయం వద్ద పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
3/8

పెద్ద ఎత్తున ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం మను బాకర్ కారులో ర్యాలీ తీశారు.
4/8

మను వెంట ఆమె కోచ్ జస్పాల్ రాణా కూడా ఉన్నారు.
5/8

10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ సింగిల్, మిక్స్‌డ్ విభాగంలో మను బాకర్ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
6/8

కేవలం 22 ఏళ్ల వయసులో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించి మను చరిత్ర సృష్టించింది.
7/8

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని సాధించి.. భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలిచింది.
8/8

పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మను బాకర్ మళ్లీ పారిస్ వెళ్లనున్నారు. ఆమె ముగింపు ఉత్సవాలలో భారత పతాకధారుల్లో ఒకరు.
Published at : 07 Aug 2024 03:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion