అన్వేషించండి
Pujara Test Record: బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైన పుజారా!
Pujara Test Record: బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైన పుజారా!

చెతేశ్వర్ పుజారా
1/5

టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో మరో 12 పరుగులు చేస్తే చాలు.
2/5

బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. ఈ రికార్డుకు పుజారా 12 రన్స్ దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 97 టెస్టుల్లో 44.76 సగటుతో 6984 పరుగులు చేశాడు.
3/5

చెతేశ్వర్ పుజారా 2010లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడాడు. అప్పట్నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో కీలకంగా మారాడు. నిలకడగా పరుగులు చేస్తూ నయావాల్‌గా అవతరించాడు.
4/5

టెస్టుల్లో 19 సెంచరీలు చేసిన పుజారా దిగ్గజ క్రికెటర్లైన రాస్ టేలర్ (న్యూజిలాండ్), గార్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్), మైక్ హస్సీ (ఆస్ట్రేలియా) సరసన నిలిచాడు.
5/5

టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పుజారా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, సునిల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ అతడికన్నా ముందున్నారు.
Published at : 21 Dec 2022 06:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విజయవాడ
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion