Andhra Pradesh Cabinet Latest News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- బీసీలకు 34 శాతం రిజర్వేషన్
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చింది. మంత్రిమండలిలో చర్చించి రిజర్వేషన్ అంశంపై బిగ్ డెసిషన్ తీసుకుంది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షత సమావేశమైన ఏపీ మంత్రిమండలి వివిధ అంశాలపై చర్చించింది. వచ్చే బడ్జెట్ సమావేశాలు, అమలులోకి తీసుకురాబోతున్న పథకాలపై కూడా చర్చించింది. ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవుల అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై కేబినెట్‌లో చర్చించి మంత్రులు ఆమోద ముద్ర వేశారు. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన రూ.44,776 కోట్ల పారిశ్రామిక ప్రతిపాదనలకు మంత్రిమండలి ఓకే చెప్పింది. పంప్డ్ స్టోరేజి, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై కూడా చర్చ జరుగుతోంది. సవరించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా కేబినెట్ ఆమోదించింది. ఉగాది నుంచి పీ4 విధానం అమలు అంశంపై కూడా మంత్రిమండలి చర్చించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చ జరుగుతోంది.
ప్రజాప్రతినిధులు, మంత్రులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పప్రచారం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులే బాధ్యత తీసుకొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుందని అన్నారు చంద్రబాబు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం, ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా అమలు చేస్తామన్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు గుడ్ న్యూస్- 26, 27 తేదీల్లో స్కూళ్లకు సెలవులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

