EPFO Update: PF ఖాతాల మధ్య నగదు బదిలీ మరింత సులభం- ఫారమ్ 13లో కీలక మార్పులు
EPFO Update: తరచూ ఉద్యోగాలు మారే వారికి EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఫారమ్ 13లో కీలక మార్పులు చేసింది. దీని సులభంగా నిధులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

EPFO Update: ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాల నిర్వహణలో మరిన్ని మార్పులు చేసింది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ ఖాతాల్లో నగదు బదిలీ చాలా కష్టతరమైపోతోంది. దీనిపై చాలా రోజులుగా ఫిర్యాదులు అందుకుంటున్న EPFO కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరికొందరు వాటిని బదిలీ చేయకుండానే అలా ఉంచేస్తున్నారు. వీటి విషయంలో కేర్ తీసుకున్న EPFO కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫారం 13లో కొన్ని మార్పులు చేసి పునరుద్ధరించింది. దీని వల్ల ప్రక్రియ మరింత ఈజీకానుంది.
EPFO శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఇప్పుడు తీసుకొచ్చిన అప్‌గ్రేడ్ విధానం ద్వారా నిధుల బదిలీలు వేగవంతం కానున్నాయి. మెరుగైన సేవలు పొందామనే భావన ఉద్యోగులకు కలుగుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న ఈజ్ ఆఫ్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉంటుందని తెలిపింది.
ఇప్పటి వరకు వివిధ సంస్థల తరఫున PF ఖాతాలు ఉన్న వారికి ఇప్పుడు తీసుకొచ్చిన ఫెసిలిటీ బాగా యూజ్ అవుతుంది. ఈ ఖాతాల్లో నగదు బదిలీకి పని చేస్తున్న ఆఫీసు, పని చేసి మానేసిన ఆఫీస్ రెండింటి ఆమోదం పొందాల్సి ఉండేది. ఈ రెండు వైపు నుంచి ఆమోదం పొందితేనే ప్రక్రియ ముందుకు సాగేది. ఇప్పుడు వచ్చిన కొత్త విధానంతో సోర్స్ ఆఫీస్ అంటే మీరు గతంలో పని చేసిన ఆఫీస్ బదిలీ అభ్యర్థనకు ఆమోదం తెలిపితే నిధులు తక్షణమే సదరు ఉద్యోగి ఖాతాలోకి వచ్చేస్తాయి. ఇక్కడ ప్రస్తుత ఖాతా నిర్వహిస్తన్న ఆఫీస్ ఆమోదం అవసరం లేదు. దీని వల్ల ప్రాసెసింగ్ టైం చాలా వరకు తగ్గుతుంది.
ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఏటా 1.25 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుందని, ప్రతి సంవత్సరం సుమారు రూ. 90,000 కోట్ల PF నిల్వలను వేగంగా బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. అప్‌గ్రేడ్ చేసిన ఫారమ్ 13 పన్ను పరిధిలోకి వచ్చే, పన్ను లోకి రాని PF నిధుల విభజన చూపిస్తుంది. ఇది వడ్డీపై కచ్చితమైన TDS చూపిస్తుంది.
యజమాని ఆమోదం అవసరం లేదు
ఇప్పటికే ఉద్యోగ మార్పు టైంలో కూడా ఖాతా నిర్వహణకు అప్పటి వరకు ఉన్న యజమాని ఆమోదం అవసరాన్ని తొలగించారు. దీంతో బదిలీ ప్రక్రియను సరళీకృతం అయింది. ఇప్పుడు నిధులు బదిలి కూడా మరింత ఈజీ చేశారు. దీంతోపాటు ఆధార్ సీడింగ్ లేకుండా యజమానులు యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ల (UANలు) బల్క్‌గా క్రియేట్ చేయవచ్చు. ఉద్యోగులు జాయినింగ్ సమయంలో ఆయా సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగులకు వెంట వెంటనే పీఎఫ్ తమ ఖాతాల్లో జమ అయ్యేందుకు వీలు కలుగుతుంది.
ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా చర్యలు చేపట్టింది ఈపీఎఫ్‌వో. ఆధార్ లేకుండా జనరేట్ చేసిన UANలు ఎక్కువ కాలం కొనసాగేందుకు వీలు లేదు. ఇప్పటికే అలాంటి అకౌంట్స్‌ను ఫ్రీజ్ చేయడానికి సిద్ధపడింది. అలాంటి అకౌంట్స్‌్ ఆధార్ సీడింగ్ జరిగిన తర్వాత మాత్రమే యాక్టివ్ చేయాలని చూస్తోంది. ఈ సంస్కరణలు EPFO సభ్యులకు మెరుగైన సేవలు అందివ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీర్ఘకాలిక ఫిర్యాదులు తగ్గుతున్నాయి. మరింతంగా స్ట్రీమ్‌లైన్ చేయడం వల్ల కూడా అర్హత కలిగిన క్లెయిమ్‌ల ఆటో-సెటిల్‌మెంట్‌కు అవకాశం కలుగుతోంది.





















