By: Arun Kumar Veera | Updated at : 01 Apr 2025 11:52 AM (IST)
EPFO క్లెయిమ్‌ల తిరస్కరణల్లో భారీ తగ్గుదల ( Image Source : Other )
EPFO Auto Settlement Advance Claim Limit Increased: EPFO చందాదార్లకు అతి పెద్ద శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organisation - EPFO), తన సభ్యులకు భారీ ఉపశమనం కల్పించింది. ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్ క్లెయిమ్ (ASAC) పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది.
గత వారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees - CBT) 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సమావేశంలో, కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా డౌరా ఈ ప్రతిపాదనను ఆమోదించారు. మార్చి 28న శ్రీనర్‌లో జరిగిన ఈ సమావేశానికి EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి కూడా హాజరయ్యారు. ఈ సిఫార్సును తుది ఆమోదం కోసం CBTకి పంపనున్నారు. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత, EPFO సభ్యులందరూ రూ. 5 లక్షల వరకు ముందస్తు PF క్లెయిమ్ చేసుకోగలరు.
EPFO ఆటో క్లెయిమ్ ఎలా ప్రారంభమైంది?
ఎవరైనా EPFO సభ్యుడు అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో చేరితే, తక్షణ ఖర్చుల కోసం, భవిష్య నిధి ఖాతా (Provident fund account) నుంచి రూ. 50,000 వరకు ముందస్తుగా ఉపసంహరించుకోవడానికి వీలు కల్పించే ఆటో క్లెయిమ్ సౌకర్యాన్ని EPFO ఏప్రిల్ 2020లో (కరోనా సమయంలో) ప్రవేశపెట్టింది. వైద్య ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని, మే 2024లో, ఈ రూ. 50,000 పరిమితిని రూ. 1 లక్షకు పెంచింది. ఇప్పుడు, రూ. 1 లక్ష పరిమితిని రూ. 5 లక్షలకు పెంచనుంది.
ఇతర అవసరాలకు కూడా...
అంతేకాదు, అనారోగ్యం & ఆసుపత్రిలో చేరడానికి మాత్రమే పరిమితమైన ఆటో క్లెయిమ్ సౌకర్యాన్ని ఇప్పుడు విద్య, వివాహం, ఇంటి కొనుగోలు వంటి మూడు కొత్త అంశాలకు కూడా వర్తింపజేశారు.
EPFO క్లెయిమ్‌ల తిరస్కరణలో భారీ తగ్గుదల
గత సంవత్సరం EPFOలో 50 శాతం వరకు క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు అది 30 శాతానికి తగ్గింది. EPFO, ఆటో క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది, తద్వారా, ఎటువంటి మానవ జోక్యం లేకుండా & ఐటీ వ్యవస్థను ఉపయోగించుకుని ఆటోమేటిక్ క్లెయిమ్ ప్రాసెసింగ్ జరుగుతుంది.
పీఎఫ్ ఉపసంహరణ నియమాల్లో ఉపశమనం
పీఎఫ్ ఉపసంహరణకు చెల్లుబాటు ఫార్మాలిటీలను 27 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. CBT 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, దానిని 6 శాతం తగ్గించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం, EPFO సభ్యుల డేటాబేస్‌ను సెంట్రలైజ్ & డిజిటలైజ్ చేయడం దిశగా కృషి చేస్తోంది. దీనివల్ల... KYC, అర్హత, బ్యాంక్ ధృవీకరణ పూర్తయిన వెంటనే క్లెయిమ్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ జరుగుతుంది. గతంలో పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే 10 రోజులు పట్టేది, ఇప్పుడు ఈ వ్యవధిని 3-4 రోజులకు తగ్గించారు.
ఏటీఎం నుంచి PF మనీ విత్‌డ్రా!
EPF 3.0ను లాంచ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అమలైతే, మీరు ఒక కార్డ్ సాయంతో మీ PF డబ్బును ATM నుంచి ఉపసంహరించుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఈ కార్డ్ పొందడానికి UAN నంబర్, ఆధార్ కార్డ్, PAN కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు (IFSC కోడ్), రద్దు చేసిన చెక్ అవసరం.
Repo Rate Cut: బ్రేకింగ్ న్యూస్ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
Reduction In Repo Rate: బ్యాంక్ లోన్ తీసుకువేవాళ్లకు భారీ శుభవార్త - రెపో రేటులో కోత, మీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే?
Gold-Silver Prices Today 09 April: ఒకేసారి రూ.7000 పెరిగిన పసిడి, పతనమైన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gold-Silver Prices Today 08 April: పట్టుకుంటే పసిడి, రూ.6500 పతనం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gold-Silver Prices Today 07 April: దాదాపు రూ.3,000 వేలు తగ్గిన గోల్డ్, పెరిగిన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
Mark Shankar Health Update: మూడు రోజులపాటు హాస్పిటల్‌లోనే మార్క్ శంకర్.. కొడుకును చూసిన పవన్ కళ్యాణ్, హెల్త్ అప్‌డేట్ ఇదే
NTR Neel Movie Release Date: 'ఎన్టీఆర్ - నీల్' మూవీ రిలీజ్ డేట్... వచ్చే ఏడాది సమ్మర్‌లో 'డ్రాగన్'తో రచ్చ రచ్చే!?
Viral News: ఒకేసారి ఇద్దరు యువతులతో పెళ్లికి సిద్ధమైన యువకుడు, ఊహించని షాకిచ్చిన పోలీసులు