Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Andhra Pradesh News | అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు ఫోన్ చేశారు. రాష్ట్రంలో పౌక్ జాతీయులను గుర్తించి వారి దేశాలకు తిరిగి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.

Amit Shah Call to All CMs | న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఉక్కుపాదం మోపుతోంది. ఇదివరకే పాక్ పౌరులు సంబంధించి వీసాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులకు మొత్తం 17 రకాల వీసాలను హోం మంత్రిత్వ శాఖ రద్దు చేస్తూ షాకిచ్చింది. ఈ నిర్ణయానికి కొనసాగింపుగా హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, తెలంగాణ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేస్తున్న ఆయన.. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు.
అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్..
భారత ప్రభుత్వం సింధు నదీ జలాలపై 1960లో చేసుకున్న ఒప్పందంపై నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయాలని కేంద్రం ఇదివరకే సూచించింది. అటారీ, వాఘా సరిహద్దులను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. ఈ క్రమంలో భారత్ నుంచి అందే అన్ని రకాల పాక్ వీసాలను రద్దు చేసినట్లు హోంశాఖ ప్రకటించింది. పాక్ పౌరులను ఆ దేశానికి తరలించాలన్న నిర్ణయంలో భాగంగా శుక్రవారం ఉదయం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్థాన్ జాతీయులను గుర్తించి, వారిని వెనక్కి పంపించేందుకు సాధ్యమైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని అమిత్ షా ఆదేశించారు.
Union Home Minister Amit Shah is speaking to all chief ministers on the issue, asking them to identify all Pakistan nationals in their respective states and take steps to ensure their prompt return to Pakistan: Sources pic.twitter.com/7MgHqkmRoe
— ANI (@ANI) April 25, 2025
హైదరాబాద్ నగరంలో 208 మంది వరకు పాక్ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. అనధికారికంగా ఇంకా చాలా మంది ఉంటారన్న వాదన సైతం ఉంది. పాక్ పౌరులు రెండు రోజుల్లో భారత్ విడిచి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎంఐఎం లాంటి కీలక పార్టీకి హైదరాబాద్ కంచుకోట. దాంతో పాక్ పౌరులను గుర్తించి ఆ దేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కత్తిమీద సాము లాంటిదే. హైదరాబాద్‌లో ముస్లింలు అధికంగా ఉంటారు, అందులోనూ పాతబస్తీ లాంటి ప్రాంతం నుంచి కరెంట్ బిల్లులు లాంటి ప్రభుత్వం విధించే బిల్లులు చెల్లించే వారు ఉండరని పలు పార్టీల నేతలు ఆరోపిస్తుంటారు. అటువంటిది పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారి దేశానికి తిరిగి అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉగ్రదాడికి మద్దతు తెలుపుతున్న పాకిస్తాన్
పాక్ తాము చేసిన తప్పులను గుర్తించకపోగా.. ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వమే కారణమని వాదిస్తోంది. మోదీ సర్కార్ పై వ్యతిరేకత వల్లే దేశంలోని భక్తులు ఉగ్రదాడి చేశాయని ఇటీవల పాక్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ మాట్లాడుతూ.. పహల్గాంలో దాడి చేసిన వారిన స్వాతంత్య్ర సమరయోధులుగా అభివర్ణించి అగ్గికి ఆజ్యం పోస్టున్నారు. సింధు జలాలు ఆపడం మీ తరం కాదు, అలా చేస్తే యుద్ధాన్ని ఆహ్వానించినట్లే అని.. తమకు హాని తలపెడితే భారత ప్రజలకు హాని చేస్తామని పాక్ ప్రభుత్వం సైతం హెచ్చరిస్తోంది.






















