Koragajja: 'కాంతార'కు భిన్నంగా సుధీర్ అత్తవర్ కొత్త సినిమా 'కొరగజ్జ'...
Gopi Sundar On Koragajja: కర్ణాటకలో సంస్కృతి, సంప్రదాయాలను 'కాంతార' ఆవిష్కరించింది. ఆ తరహాలో రూపొందుతున్న మరో సినిమా 'కొరగజ్జ'. సుధీర్ అత్తవర్ తీస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ చేస్తున్నారు.

Sudheer Attavar's Koragajja movie update: కన్నడ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తీసిన 'కాంతార' పాన్ ఇండియా సక్సెస్ అయ్యింది. ఆ సినిమాలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో సంస్కృతి సంప్రదాయాలను ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ తరహాలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'కొరగజ్జ'. దర్శకుడు సుధీర్ అత్తవర్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
కర్ణాటక, కరావళిలో దైవం కొరగజ్జ
త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ సంస్థలపై సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'కొరగజ్జ'. కర్ణాటకతో పాటు కేరళలోని కరావళి (తులునాడు), ఇంకా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పూజించే 'కొరగజ్జ' దేవత చుట్టూ తిరిగే చిత్రమిది. దీనికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటువంటి చిత్రానికి తాను సంగీతం అందించడం తనకొక ప్రత్యేక అనుభవం అని ఆయన చెబుతున్నారు. ఈ
'కొరగజ్జ'లో సరికొత్త ప్రయోగాలు చేశా - గోపి సుందర్
Gopi Sundar shares his experience on working for Koragajja movie: 'కొరగజ్జ' చిత్రానికి సంగీతం అందించడానికి తాను ఎంతో పరోశోధన చేయాల్సి వచ్చిందని గోపి సుందర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ సినిమా కోసం కొత్త ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. కొరగజ్జ దేవత చరిత్ర, ఆ అమ్మవారి నేపథ్యంలో సంగీతం చేయడం కోసం చరిత్రను తెలుసుకోవడనికి ఎక్కువ టైం పట్టింది. ఆ ఆచారాలు, సంప్రదాయాలను అర్థం చేసుకున్న తర్వాత బాణీలు వచ్చాయి. ఈ సినిమా నాకొక సవాలు'' అని అన్నారు. 'కొరగజ్జ' సినిమాలో ఆరు పాటలు ఉన్నాయని, ఆరింటిని వివిధ భాషల్లో - శైలిలో చేశారని తెలిసింది. శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి స్టార్ సింగర్స్ పాటలు పాడారు.
'కాంతార' కంటే ఎంతో భిన్నంగా 'కొరగజ్జ' సినిమా ఉంటుందని దర్శకుడు సుధీర్ అత్తవర్ వెల్లడించారు. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని గొప్ప సాంస్కృతిక వారసత్వంలో 'కాంతార' ఒకరిని మాత్రమే చూపించిందని, విద్యాధర్ శెట్టి సహాయంతో పరిశోధన చేసి ఈ సినిమా చేశామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది.



















