అన్వేషించండి

Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు

Andhra Pradesh News | జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల కాల్పుల్లో విశాఖ, నెల్లూరుకు చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు. విశాఖకు చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు.

Chandramouli Funeral | విశాఖపట్నం: జమ్మూకశ్మీర్‌‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ హిందూ శ్మశాన వాటికలో చంద్రమౌళి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. చంద్రమౌళి అంత్యక్రియలో మంత్రులు, కూటమి నేతలు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రమౌళి అంతిమ సంస్కారాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వీడ్కోలు పలికారు. చంద్రమౌళి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అంతకుముందు శుక్రవారం ఉదయం పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి నివాసానికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన చంద్రమౌళి పార్థివదేహానికి నివాళులర్పించారు. చంద్రమౌళి సతీమణి నాగమణిని హోం మంత్రి అనిత ఓదార్చారు. అనంతరం ఇంటి నుంచి మొదలైన చంద్రమౌళి అంత్యక్రియలో పాల్గొన్నారు. 


Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు

రూ.10 లక్షల పరిహారం అందించిన ఏపీ ప్రభుత్వం
పెదవాల్తేరు: ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి గురువారం (ఏప్రిల్ 24న) పరామర్శించారు. పాండురంగాపురంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన ఆయన.. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల పరిహారం చెక్కును చంద్రమౌళి కుటుంబసభ్యులకు అందజేశారు. అందమైన కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో నింపిందన్నారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. 

Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు

పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఆ దాడిలో మృతులకి సంతాపంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఉదయం విజయవాడలో మానవ హారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలు సామినేని ఉదయ భాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, అక్కల గాంధీ, రావి సౌజన్య, మల్లెపు విజయ లక్ష్మి తదితరులు సైతం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పాక్ చర్యలకు భారత ప్రభుత్వం తగిన రీతిలో బుద్ధి చెబుతుందన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget