అన్వేషించండి

EXCLUSIVE: పహల్గాం ఉగ్రదాడితో పాక్ ఆర్మీకి లింకులు, మాస్టర్ మైండ్ సైఫుల్లానే, ఉగ్రవాదులకు ట్రైనింగ్.. సంచలన విషయాలు

Pahalgam terrorist attack | పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి ఐదుగురు ఉగ్రవాదులను సిద్ధం చేశాడని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Pahalgam Terror Attack: అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం దాడిని భారత్ సీరియస్‌గా తీసుకుంది. భారత బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సంబంధించి గూఢచర్య నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం దాడిని లష్కర్-ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి ప్లాన్ చేశాడు. ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరిలో సమావేశమయ్యారు. సైఫుల్లా ఐదుగురు ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడికి సిద్ధం చేశాడు. ఆ తరువాత మార్చిలో ఆ ఉగ్రవాదులు మమరోసారి సమావేశమయ్యారు. జమ్ముా కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ కు లింక్ ఉందని తేలింది. 

పహల్గాం దాడికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ప్లానింగ్ ప్రారంభమైంది. లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఆదేశాలతో ఉగ్రదాడి ప్లాన్ ప్రారంభమైంది. ఉగ్రవాదులు మొదటి సమావేశం ఫిబ్రవరిలో జరిగింది. ఆ తరువాత మార్చిలో మీర్ పూర్‌లో మరోసారి సమావేశమై దాడుల గురించి మరింతగా చర్చించారు. ఈ సమావేశంలో పహల్గాంలో దాడి గురించి ప్లాన్ చేశారని నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం కూడా సహాయం చేసింది. ఏబీపీ న్యూస్ ప్రత్యేక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.  

పహల్గాం దాడికి ఎలా ప్లాన్ చేశారు ? 

లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ కమాండర్ సైఫుల్లా ఐదుగురుఉగ్రవాదులతో ఫిబ్రవరి, మార్చి నెలలో సమావేశం అయ్యాడు. ఫిబ్రవరి మీటింగ్ తరువాత మీర్ పూర్ లో పహల్గాం దాడికి ప్లాన్ తయారుచేశారు. సైఫుల్లా తో సమావేశంలో అబూ మూసా, ఇద్రీస్ షాహీన్, మొహమ్మద్ నవాజ్, అబ్దుల్ రఫా రసూల్, అబ్దుల్లా ఖాలిద్ అనే ఉగ్రవాడులు పాల్గొన్నారు. మరోవైపు సైఫుల్లాకు ISI నుండి ఆదేశాలు వచ్చాయి.  

పహల్గాం దాడికి పాక్ ప్రభుత్వానికి లింకులు

లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా పాకిస్తాన్ సైన్యంతో సంప్రదింపులు జరిపేవాడు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ శిబిరానికి వెళ్లాడు. బహావల్ పూర్ లోని ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్ సైన్యం కెర్నల్ ఉగ్రవాది సైఫుల్లాకు ఆహ్వానించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో దీనికి సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది.  ఏప్రిల్ 18 న రావల్కోట్ లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. దీని వీడియో బయటకు రాగా, అందులో సైఫుల్లాతో పాటు ఐదుగురు ఉగ్రవాదులు కనిపించారు. 

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల అనుమానిత నివాసం ధ్వంసం 

 పహల్గాం దాడితో సంబంధం ఉందని అనుమానిత స్థానిక ఉగ్రవాది అదిల్ గురి ఇల్లును భద్రతా దళాలు బాంబు పేల్చి ధ్వంసం చేశాయి. బిజ్బెహెరా ప్రాంతంలో ఉగ్రవాది అదిల్ గురి ఇల్లు ఉందని సమాచారం తెలుసుకుని బలగాలు ధ్వంసం చేశాయి. త్రాల్ లోని ఆసిఫ్ షేక్ ఇంటిని భారత బలగాలు కూల్చివేశాయి. మరోవైపు బండిపొరలో జరిగిన ఎన్ కౌంటర్ లో అల్తాఫ్ లల్లీ అనే లష్కే తోయిబా టాప్ కమాండర్ హతమయ్యాడు. ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి.

నీరజ్ రాజ్ పూత్ మరియు శివాంక్ మిశ్రా నివేదిక...

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
BJP National Office Bearers Meeting: నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget