ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.



ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా వాట్సాప్‌ సేవలు



161 పౌర సేవలను ‘‘మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం’’ ద్వారా అందిస్తోంది.



స్మార్ట్ ఫోన్ ఇంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.



9552300009 మొబైల్ నంబర్‌ను వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు కావాల్సిన సేవలు పొందొచ్చు



క్యూ ఆర్‌ కోడ్‌లతో జారీ చేసే సర్టిఫికెట్లు స్కాన్‌ చేస్తే వివరాలు వచ్చేస్తాయి.



వాట్సాప్‌లో అందించే సేవలకు మెటా నుంచి ఫోన్‌ కాల్స్ రావు



ఆధార్ కార్డుతో లింక్ చేసిన నెంబర్లకే సేవలు అందుబాటులో ఉంటాయి.



పౌరుల సమాచారాన్ని మెటా స్టోర్ చేయదని ప్రభుత్వం చెబుతోంది.



డేటా సర్వర్లు ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణ, సంరక్షణలోనే ఉంటాయి.



మానవ ప్రమేయం లేని సేవలను త్వరగా అందిస్తారు.



పౌర సేవలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించలేదు.