షర్మిలను పూర్తిగా సైడ్ చేసేశావా జగనన్నా!

ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంతో పాటూ పులివెందుల చర్చిలో కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు జగన్

చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తో జగన్ తీయించుకున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఈ ఫొటోలో తన సోదరి షర్మిల, వివేకా కుమార్తె సునీత మినహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపిస్తున్నారు..

అవినాష్ రెడ్డి ఫ్యామిలీ కూడా ఇందులో ఉంది..ఈ ఫోటోలో వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు

కొన్నాళ్లుగా విజయలక్ష్మి కుమార్తె షర్మిలతో కలసి వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడంతో జగన్ తల్లిని కూడా పట్టించుకోలేదన్నారు..

అన్నా చెల్లెలు మధ్య ఆస్తి వివాదాలు తీవ్రంగా జరుగుతున్నాయని అందుకే షర్మిలను ఒంటరి చేయాలన్నదే జగన్ ఆలోచన అంటున్నారంతా

పుట్టిన రోజునాడు కనీసం ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేనంత గ్యాప్ వచ్చిందంటున్నారు

తన కుటంబంలో తల్లితోపాటూ అత్యధిక మంది తనతోపాటే ఉన్నారని చెప్పేందుకు ఈ గ్రూప్ ఫొటో జగన్ వదిలారనే టాక్ వినిపిస్తోంది

ఇంట్లో ప్రత్యర్థుల్ని పెంచుకోకూడదు అని జగన్ దిద్దుబాటు చర్యలతో పాటూ షర్మిలను ఒంటరి చేయాలనే వ్యూహాంలో భాగం అనే డిస్కషన్ జరుగుతోంది