ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో జగన్ సర్కార్ నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు

రుషికొండ ప్యాలస్ లో బ్లాక్ ల వారిగా తిరిగి ఏపీ సీఎం చంద్రబాబు అన్ని భవనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఉత్తరాంధ్ర ఇరిగేషన్ కోసం రూ.400 కోట్లు ఖర్చు పెట్టలేదు, కానీ రూ.430 కోట్లతో జగన్ ఈ ప్యాలెస్ కట్టాడన్నారు

7 బ్లాక్ లు కట్టడంతో పాటు చుట్టూ ఉన్న 18 ఎకరాలను జపాన్ టెక్నాలజీతో రుషికొండ చుట్టూ ప్రొటెక్షన్ కట్టించారని షాకయ్యారు

రాష్ట్రపతి, ప్రధానులు నావెల్ గెస్ట్ హౌస్ లొనే ఉన్నారు కానీ, ప్యాలెస్ కట్టాలని అడగలేదు అన్నారు చంద్రబాబు

బాత్ టబ్ కి రూ.36 లక్షలు, కమోడ్ కు 12 లక్షలు ఖర్చుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు

రాజధాని నిర్మిస్తామని ప్రజల్ని మభ్య పెట్టి, కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసారన్నారు.

రుషికొండ ప్యాలెస్ భవనాలపైపై ప్రజా కోర్టులో చర్చ జరగాలని, వారి ఆరాచకాలను ప్రజల ముందు పెడతామన్న చంద్రబాబు

ఎటు చూసినా సముద్రం కనపడేలా నిర్మించారని, అప్పట్లో రాజులకు కూడా ఇలాంటి ఆలోచనలు రాలేదని చంద్రబాబు అన్నారు

వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారని వైసీపీ అంటోంది