జగన్ తిరుమల పర్యటన రద్దు..కారణం అదేనా!
డిక్లరేషన్‌పై రాజకీయ దుమారం చెలరేగుతున్న సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ బీజేపీ, సంఘాల నుంచి డిమాండ్స్ వెల్లువెత్తాయ్
ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు
శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను పాటించాలని కోరుతున్నా అని చంద్రబాబు ట్వీట్ చేసిన కొద్దిసేపటి తర్వాత జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్న ప్రకటన వచ్చింది
జగన్‌పై దాడికి కుట్ర జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు..ప్రజల్లో కలిసే సమయంలో దాడి చేయాలని కుట్రచేస్తున్నారని ఆరోపించారు
తిరుమల వెళ్లేందుకు సిద్ధంగా ఉంచుకున్న ప్రత్యేక విమానాన్ని కూడా జగన్ రద్దు చేసినట్లు తెలిసింది
డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్....